పెళ్ళి చేసుకోవడం వల్ల.. అరుంధతి లో అనుష్క పాత్ర మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Oct 25, 2025, 01:35 PM IST

అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. అయితే ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క పాత్ర అద్భుతం. ఈ క్యారెక్టర్ ను చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు. కానీ పెళ్లి చేసుకోవడం వల్ల అరుంధతి పాత్ర మిస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా? 

PREV
15
అద్భుతం చేసిన అరుంధతి

అనుష్క ప్రధాన పాత్రలో నటించి.. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా అరుంధతి. 2009లో విడుదలైన టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అరుంధతి' అనుష్క శెట్టికు సినీ కెరీర్‌లో భారీ మలుపు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అరుంధతి. దాదాపు 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక స్టార్ హీరో లేకుండా.. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కి.. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది అరుంధతి. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఈ పాత్ర కోసం అనుష్క కంటే ముందు చాలామంది హీరోయిన్లను అనుకున్నారట కోడి రామకృష్ణ.

25
రిజెక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్లు

అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర కోసం ముగ్గరు హీరోయిన్లను మనసులో అనుకున్నాడట కోడి రామకృష్ణ అందులో ఇద్దరు హీరోయిన్లను సంప్రదించాడు కూడా. మలయాళ హీరోయిన్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ తో పాటు కన్నడ హీరోయిన్ ప్రేమను కూడా అడిగారట. ప్రేమ డేట్స్ కుదరక ఈ సినిమాను చేయలేకపోయింది. మమతామోహన్ దాస్ మాత్రం ఈసినిమా చేస్తే లైఫ్ ఉండదు అని ఎవరో చెప్పిన మాటలు విని.. వదులుకుంది. ఇక ఈ ఇద్దరు కాకుండా మరో హీరోయిన్ ఈసినిమాను మిస్ అయ్యిందని మీకు తెలుసా? ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి.

35
అరుంధతి పాత్ర పై రాశీ కామెంట్స్

రీసెంట్ గా రాశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. అందులో తన కెరీర్ కు సబంధించిన చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఈక్రమంలోనే మీరు చేయాలి అనుకుని మిస్ అయిన పాత్ర ఏదైనా ఉందా అని యాంకర్ నుంచి ప్రశ్నఎదురయ్యింది. అప్పుడు రాశీ అన్నారు.. '' అరుంధతి సినిమాలో అనుష్క చేసిన జేజమ్మ పాత్ర అంటే నాకు ఇష్టం, ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ విషయం గురించి కోడి రామకృష్ణ గారిని ఓ సందర్భంలో అడిగాను, అరుంధతి పాత్ర కు నన్నెందుకు తీసుకోలేదు.. అని అడిగాను. దానికి ఆయన మాట్లాడుతూ.. నిన్ను ఎవరు ముందే పెళ్ళి చేసుకోమన్నారు. ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నావ్ కాబట్టి ఇలా జరిగింది అని ఆయన అన్నారు. అందులోనే ఆన్సర్ కూడా ఉంది'' అని రాశీ వెల్లడించారు.

45
కోడి రామకృష్ణతో రాశీ అనుబంధం

కోడి రామకృష్ణకు అరుంధతి సినిమాలో రాశీని తీసుకోవాలని ఉంది. కానీ అప్పటికే రాశీకి పెళ్లైపోయింది. దాంతో ఆయన వేరే ఆప్షన్ చూసుకున్నారు. ఒక వేళ పెళ్లి అవ్వకుండా ఉండి ఉంటే రాశీ జేజమ్మగా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేది. రాశీకి కోడిరామకృష్ణతో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రామకృష్ణ సినిమాల్లో నటించింది రాశీ. పైగా రాశీది సినిమా ఫ్యామిలీ కావడంతో.. ఆయనతో ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది. ఈ విషయాలను రాశీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాదు కోడిరామకృష్ణను తాను అంకుల్ అనే పిలుస్తాను అని ఆమె అన్నారు.

55
రాశీ సెకండ్ ఇన్నింగ్స్

హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత రాశీ పెళ్లి చేసుకుని ఫ్యామిలీకే మొత్తం టైమ్ కేటాయించింది. చాలా కాలం వరకూ సిల్కవ్ స్కీన్ వైపు తొంగి చూడలేదు హీరోయిన్. కొన్నాళ్లకు నిజం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా.. అది ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. రీ ఎంట్రీలో సరైన పాత్రలు పడలేదు రాశీకి. ఆతరువాత కాలంలో బుల్లితెరపై కూడా సందడి చేసింది మాజీ హీరోయిన్. జానకి కలగనలేదు సీరియల్ లో.. హీరో తల్లి పాత్రలో నటించింది. ఈసీరియల్ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాల్లో సందడి చేస్తోంది రాశీ.

Read more Photos on
click me!

Recommended Stories