మెగా చీఫ్ గా అవినాష్.. గౌతమ్ కు మేటర్ లేదన్న నయని పావని, దివాళి సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

First Published | Nov 1, 2024, 11:20 PM IST

బిగ్ బాస్ హౌస్ కు 9వ వారం మెగా చీఫ్ గా అవినాష్ గెలిచాడు. హోరా హోరి పోరులో మొత్తానికి విజయం సాధించాడు అవినాశ్. దివాళి సందర్భంగా ఇంట్లోవారికి పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. 

బిగ్ బాస్ తెలగు సీజన్ 8 అద్భుతంగా సాగుతోంది. నవరసాల కలయికగా కనిపిస్తోంది. టాస్క్ లు అద్భుతంగా కంప్లీట్ చేస్తున్నారు. ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు. ఇటు ప్రేమలు.. ఆటు రాజకీయాలు.. మరో వైపు వెన్నుపోట్లు.. ఇంకోవైపు సెలబ్రేషన్లు.. ఇలా రకరకాలుగా కనిపిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ 9వ వారం చీఫ్ గా అవినాష్ విజయం సాధించాడు. 

రెండు రోజులు జరిగిన టాస్క్ లలో చివరిగా హోరా హోరీపోరు జరిగింది. ఇందులో నిఖిల్, ప్రేరణ, నబిల్, హరితేజ, టేస్టీ తేజ, అవినాష్, యష్మి, పాల్గొనగా.. అందులో రౌండ్ రౌండ్ కు ఒకరు బయటకు వస్తూ.. చివరకు నబిల్, అవినాష్ మిగిలారు. నిఖిల్, నబిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ నుంచి కూడా తప్పించుకుని.. వారిని ఒడించాడు అవినాశ్. దాంతో మెగా చీఫ్ గా గెలుపొందాడు. 

Also Read: గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి

ఇక బిగ్ బాస్ హౌస్ లో దివాళి సబంరాలు అంబరాన్ని అంటాయి. ఈలోపు ఉదయం లేవగానే ఓ చిన్న గొడవతో బిగ్ బాస్ డే స్టార్ట్ అయ్యింది. తేజకు, నయనీపావనికి మధ్య గొడవ జరుగుతండగా.. గౌతమ్ సర్ధిచెప్పబోయాడు. దాంతో నయనీపావని నోరుజారి నీకు మేటర్ లేదు అన్నది. దాంతో ఫైర్ అయ్యాడు గౌతమ్. అక్కా అంటూ నయనీని టీజ్ చేశాడు. 

ఇక ఆ గొడవ అయిపోగానే హౌస్ లో మగవారికి, మహిళలకు రంగోళీపోటీ పెట్టాడు బిగ్ బాస్. రెండు టీమ్ లు అద్భుతంగా రంగోళీ వేశారు. ఇక బిగ్ బాస్ దివాళి స్వీట్స్ పంపించడంతో పాటు.. నబిల్ కు కూడా పండగ సందర్భంగా స్వీట్స్ తినే అవకాశం కల్పించారు. గతంలో హౌస్ మెంట్స్ కోసం నబిల్ స్వీట్స్ ను త్యాగం చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్న దీపావళి వేడుకలు


ఇక హౌస్ లో ఉన్నవారికి బిగ్ బాస్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. పండగ సందర్భంగా ఇంటి నుంచి వచ్చిన వీడియోస్ ను ప్లే చేస్తున్నాడు. అది కూడా ఓ టాస్క్ రూపంలోనే అందులో మొదటగా నబిల్ తన వీడియో చూసుకుని చాలా సంతోషించాడు తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. 

ఆతరువాత టేస్టీ తేజ తల్లీ తండ్రులు, విష్ణు ప్రియ కు వాళ్ల ఆంటీ  నుంచి,రోహిణీకి వాళ్ళ అమ్మ నుంచి, పృధ్వీ, అవినాష్ కు వారి బ్రదర్స్ నుంచి యష్మీకి తల్లీ తండ్రుల నుంచి వీడియోస్ వచ్చాయి. ఇక నయనీపావణికి కూడా తన సోదరి నుంచి వీడియోవస్తుంది. హరితేజకు తన కూతురు నుంచి వీడియో వస్తుంది. 

Also Read: అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకూ.. తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

పండగరోజు ఇంట్లో వాళ్లను చూసుకుని దిల్ ఖుష్ అవుతారు హౌస్ మెంట్స్. ఇక నిఖిల్, గంగవ్వ, గౌతమ్, ప్రేరణలకు మాత్రం వీడియో సందేశం చూపించలేదు బిగ్ బాస్. దివాళి సందర్భంగా సెలబ్రేషన్స్ తో పాటు మంచిఫుడ్ కూడా పంపించాడు బిగ్ బాస్. అంతకు ముందు రేషన్ అయిపోవడంతో రెండు పాల పాకెట్ల కోసం అందరిని ఎంటర్టైన్ చేశాడు అవినాశ్. 

దివాళి సెలబ్రేషన్స్ ను ఘనంగా చేసుకున్నారు సరే. ఇక నెక్ట్స్ వీకెండ్ ఎపిసోడ్ రెడీగా ఉంది. కింగ్ నాగార్జున ఎవరెవరికి క్లాస్ పీకపోతున్నాడు. ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారుఅనేది ఉత్కంఠగామారింది. ఈవీక్ చాలా విషయాలు జరిగాయి బిగ్ బాస్ లో. దాంతో ఏంజరుగుతందో చూడాలి.  

Also Read:  విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?

Latest Videos

click me!