పుట్టిన నాలుగు నెలలకే కూతురు చనిపోవడంతో శ్రీహరి ఏం చేశాడో తెలుసా?.. ఆ మూడు గ్రామాల పాలిట దేవుడు

Published : Nov 01, 2024, 09:55 PM IST

రియల్‌ స్టార్‌ శ్రీహరి జీవితంలో ఓ విషాదం ఉంది. తనకు కూతురు పుట్టిన నాలుగు నెలలకే చనిపోయిందట. కానీ కూతురు ఎప్పుడూ మన ముందే ఉండాలని శ్రీహరి ఏం చేశాడంటే?  

PREV
16
పుట్టిన నాలుగు నెలలకే కూతురు చనిపోవడంతో శ్రీహరి ఏం చేశాడో తెలుసా?.. ఆ మూడు గ్రామాల పాలిట దేవుడు

శ్రీహరి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కనీసం ఇళ్లు లేని స్థితి నుంచి స్టార్‌ హీరోగా ఎదిగాడు శ్రీహరి. బాడీ బిల్డింగ్‌, బాక్సింగ్‌, జిమ్నాస్టిక్స్ లో ట్రైన్‌ అయి, జాతీయ స్థాయిలో పాల్గొని మెడల్స్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి, నెమ్మదిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ, విలన్‌గా మారి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని మెప్పించాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

26

హీరోగా `భద్రాచలం`, `పోలీస్‌`, `సింహాచలం` వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ, మరోవైపు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్‌గా చేస్తూ మెప్పించాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీహరిది ప్రత్యేకమైన స్థానం. ఎవరూ భర్తీ చేయలేని స్థానం. హీరో తర్వాత హీరో అనిపించేలా, బలమైన క్యారెక్టర్లకు ఆయన కేరాఫ్‌. ఆయన చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారంటే అతిశయోక్తి కాదు. 
 

36

ఇదిలా ఉంటే శ్రీహరి, డాన్సర్‌ డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు జన్మించారు. అమ్మాయిలు కావాలని శ్రీహరికి చాలా ఉండేదట. కోరుకున్నట్టుగానే తనకు ఇద్దరు కొడుకుల తర్వాత అమ్మాయి జన్మించింది. కానీ ఆ పాప పుట్టిన నాలుగు నెలలకే చనిపోయిందట. దీంతో శ్రీహరి తట్టుకోలేకపోయారట.

అయితే తన కూతురుని ఎప్పుడూ మనతోనే ఉండాలని, మన ముందే కనిపించాలని ఓ నిర్ణయానికి వచ్చారట. తన ల్యాండ్‌లో ఒక అర ఎకరాలో కూతురు స్మారకంగా సమాధి కట్టించాడట. తను మాతోనే ఉందనే ఫీలింగ్‌ తెప్పించేలా ఆ పని చేశారట. 
 

46

అంతేకాదు.. కూతురు పేరు అక్షర. తన కూతురు ఇంకా జనంలో కూడా గుర్తిండిపోవాలని, ఎప్పుడూ ఆ పాప పేరు వినిపించాలని చెప్పి ఫౌండేషన్‌ స్టార్ట్ చేశారట. అదే అక్షర పౌండేషన్‌. అంతకు ముందు ఆపదలో ఉన్నవారికి, సాయం అడిగిన వారికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. కానీ వాటికి ఓ పేరు, గుర్తింపు ఉండదు. ఇలా ఫౌండేషన్‌ ద్వారా చేస్తే కూతురు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పి దాన్ని స్థాపించాడట శ్రీహరి.

గ్రామాలను దత్తత తీసుకుని వాళ్లకి హెల్ప్ చేయాలనుకున్నారు. అలా మేడ్చల్‌ మండలంలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారట. అక్కడి ప్రజలకు అవసరమైన వసతులు, స్కూల్‌ పిల్లలకు డ్రెస్సులు, మధ్యాహ్న భోజనానికి ప్లేట్స్‌ ఇలా చిన్న చిన్న అవసరాలు తీర్చారట. అంతేకాదు అక్కడ ప్రధాన సమస్య ఫ్లోరిన్‌. 
 

56
photo credit -abn

అందుకోసం వాటర్ ఫ్లాంట్లు నిర్మించారట. సుమారు 45-50లక్షలతో  మూడు ఊర్లకి వాటర్‌ ఫ్లాంట్లు నిర్మించారు. వాటిపై ఆధారపడి ఓ 30తండాలు కూడా ఉన్నాయని, వాటికి కూడా ఫిల్టర్‌ వాటర్‌ సదుపాయం కల్పించినట్టు తెలిపారు శ్రీహరి. అయితే ఆ వాటర్‌ ఫ్లాంట్ నిర్మాణం అయిపోయిన ఆరునెలలకు ఆ ఊరికి వెళ్లాడట శ్రీహరి. అక్కడి ప్రజల ఆదరణ, ప్రేమని చూసి ఆశ్చర్యపోయాడట.

తనని చూడగానే ఆ జనం అంతా దండాలు పెడుతూ ఆయ్యా మా పాలిట దేవుడివయ్యా అంటుంటే కన్నీళ్లు ఆగలేదని, అక్కడ ఉన్నంత సేపు తనకు కన్నీళ్లు కారుతూనే ఉన్నాయని, తనని బ్లెస్ చేసిన విధానం చూసి ఇక చాలు ఈ జన్మకి అనిపించిందని తెలిపారు శ్రీహరి. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలను బయటపెట్టారు శ్రీహరి. 
 

66
photo credit -abn

జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్‌ స్పెషల్‌ టాలెంట్‌తో మెప్పించి, రియల్‌ స్టంట్స్ చేసి రియల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీహరి 2013లో అనారోగ్యంతో కన్నుమూశారు. బాలీవుడ్‌ ఫిల్మ్ `ఆర్‌ రాజ్ కుమార్‌` చిత్ర షూటింగ్‌లో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలో లీలావతి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ అక్టోబర్‌ 9న కన్నుమూశారు. తన కూతురు పక్కనే ఆయన్ని సమాధి చేయడం విశేషం. 

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోల చేతుల్లో మోసపోయిన నగ్మా.. సంచలన నిర్ణయం వెనుక గుండె పగిలేనిజాలు
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories