ఎన్టీఆర్ వర్సెస్ రజినీకాంత్, ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

Published : Aug 11, 2025, 06:54 AM IST

ఈ వారం థియేటర్ లో రసవత్తరమైన పోరు జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీకి రెండు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? రిలీజ్ ఎప్పుడు? 

PREV
16

ఈవారం రిలీజ్ కు రెండు సినిమాలు 

ప్రతీవారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఒక్కోసారి మాత్రం సినిమాల హడావిడి పెద్దగా ఉండదు. ఈక్రమంలోనే ఈవారం థియేటర్ లో రెండు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. అందులో అందులో ఒకటి వార్ 2 కాగా, మరొకటి కూలీ. ఈరెండు సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ప్రముఖంగా ఈ రెండు సినిమాల మధ్య మాత్రమే పోటీ జరగబోతోంది.

26

ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ వార్ 2 మూవీ

ఈ వారం థియేటర్ లో రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ కు ఉన్నాయి. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ ఒకటి. ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా.. ముఖ్యమైన పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ఈమూవీ తెరకెక్కింది. ఈసినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డాడు. తన బాడీని కూడా కంప్లీట్ గా ఛేంజ్ చేసుకున్నారు. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా ఉన్న హృతిక్ కు పోటా పోటీగా టాలీవుడ్ యాక్షన్ హీరో ఎన్టీఆర్ నటించారు. ఇద్దరు గొప్ప డాన్సర్లు కావడం విశేషం. ఈ సినిమాలో ఇద్దరి యాక్షన్ సీన్స్ చూడటానికి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

36

కాలర్ ఎగరేసిన జూనియర్ ఎన్టీఆర్ 

తాజగా ఈసినిమాకు సబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తారక్ మీకు అన్నయ్య అయితే.. ఆయన నాకు తమ్ముడు అని హృతిక్ రోషన్ కామెంట్ చేశారు. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను, షూటింగ్ లో ఉన్నప్పుడు అంత ఎనర్జీతో ఎలా ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి తెలుకున్నానంటూ కామెంట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో. ఇక కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్ ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారు. దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వార్ 2 ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.

46

విలన్ గా నాగార్జున 

ఇక వార్ 2 తో పాటు అదే రోజు ( అగస్ట్ 14) రిలీజ్ కాబోతుంది మరో పాన్ ఇండియా సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈసినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు. ఈసినిమాలో రజినీకాంత్ హీరోగా నటిస్తే, టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున విలన్ గా అలరించబోతున్నాడు. తమిళంలో అంతకు ముందే కుబేరా సినిమా చేశాడు నాగార్జున, ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడిచింది. కాగా కూలీ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

56

1000 కోట్ల కలెక్షన్లు టార్గెట్ 

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జునతో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ , సత్యరాజ్ లాంటి స్టార్స్ నటించారు. శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటించని ఈమూవీలో పూజా హెగ్డే చేసి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా ప్రీరిలీజ్ బిజీనెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. ఇంత వరకూ తమిళం నుంచి 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా రాలేదు. దాంతో కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు.ఇక అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈసినిమాకు హైలెట్ కాబోతోంది. అగస్ట్ 14న రిలీజ్ కాబోతున్న ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.

66

గెలుపెవరిది

రెండు తెలుగు సినిమాలు కాదు. ఒకటి బాలీవుడ్ మూవీ మరొకటి తమిళ మూవీ. అయితే ఈ రెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తుండటంతో తెలుగులో కూడా ఈసినిమాలపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగర్జున కాంబినేషన్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. మరో వైపు వార్ 2 లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్షన్ సీన్స్ కోసం యూత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోటీ పోటీగా రిలీజ్ అవుతున్న ఈసినిమాలతో మరే సినిమా పోటీకి లేకపోవడంతో ఆడియన్స్ రెండు సినిమాలను ఆదరించే అవకాశం కనిపిస్తోంది. కథ పరంగా ఏసినిమా కనెక్ట్ అవుతుంది, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరికి ఓటు వేస్తారు అనేది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories