గురువును కాపీ కొడుతున్న శిష్యుడు
ఇందులో మరో హైలైట్ ఏమిటంటే, శంకర్ చేసిన తప్పులన్నింటినీ అట్లీ చేయలేదు. టాప్ నటులతో సినిమాలు తీస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కొత్త నటులతో బాయ్స్ అనే సినిమా తీశాడు శంకర్. ఆ సినిమా ఆయనకు కలిసి రాలేదు. అందుకే అట్లీ అలాంటి రిస్క్ తీసుకోలేదు.
ఇప్పుడు త్వరలో శంకర్ లాగే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అట్లీ. శంకర్ రజనీకాంత్‌తో కళానిధి మారన్ నిర్మాణంలో రోబో అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను తీసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచినట్లుగానే, అదే కళానిధి మారన్ నిర్మాణంలో అల్లు అర్జున్‌తో అట్లీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇది భారతీయ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లే సినిమాగా చెబుతున్నారు.