ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? మళ్లీ సినిమాల్లో రావాలని ఫ్యాన్స్ డిమాండ్

Published : Jan 21, 2026, 05:00 PM IST

90లలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు పొందిన నటి అసిన్.  పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది ఈ బ్యూటీ.. కానీ.. ఆమె పై అభిమానులకు ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. 

PREV
13
Asin latest photo

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ కి పరిచయం అవసరం లేదు.  మలయాళంలో అరంగేట్రం చేసి.. తమిళంలో గజినీ మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇదే సినిమా తెలుగులో డబ్ చేయగా… ఇక్కడ కూడా ఆమె కుర్రాళ్ల మనసు దోచుకుంది. అప్పటి నుంచి వరసగా తెలుగులో స్టార్ హీరోల సరనన నటించింది. సినిమాలో అసిన్ ఉంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే భావన అందరిలోనూ కలిగింది. గోల్డెన్ లెగ్ గుర్తింపు తెచ్చుకున్న అసిన్…. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదు.

23
అసిన్ ఫోటో షేర్ చేసిన భర్త రాహుల్...

అసిన్ పెళ్లి జరిగి  పదేళ్లు అవుతోంది. కాగా.. ఆమె తాజా ఫోటోని భర్త రాహుల్ శర్మ షేర్ చేశారు. పదో సంవత్సర పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ  ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పదేళ్ల తర్వాత.. అసిన్ ని చూసిన ఫ్యాన్స్.. ప్రస్తుతం ఆ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. దీంతో.. అసిన్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

33
అసిన్ భర్తకు ఫ్యాన్స్ ప్రశ్నలు...

అసిన్ ని మళ్లీ సినిమాల్లోకి పంపమని ఆమె భర్తను అడగడం విశేషం. ప్రస్తుతం  ఆమె ఎక్కడుంది, ఏం చేస్తోందని చాలామంది అడుగుతున్నారు. సినిమాలకు దూరమైనా అసిన్‌పై అభిమానం తగ్గలేదనడానికి ఈ కామెంట్లే సాక్ష్యం. రాహుల్ ఆమెను 'నమ్మశక్యం కాని కో-ఫౌండర్' అని వర్ణించారు. వయసు 40 దాటినా.. అసిన్ అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్ చేయడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories