ఎపిసోడ్ ప్రారంభంలో కడుపులో ఉన్న బిడ్డతో తనలాగా మాట్లాడుతున్న భార్యని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఆర్య. కడుపులో ఉన్న బిడ్డ కోసం జోల పాడుతుంది అను. ఆమె ఒడిలో వాలిపోతాడు ఆర్య. నువ్వు జోల పాడుతుంటే అమ్మ ఒడిలోనే పడుకున్నట్లుగా ప్రశాంతంగా ఉంది అంటాడు. సంతోషించిన అను మళ్లీ పాట పాడుతుంది. మరోవైపు కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్ గీస్తూ ఉంటాడు మదన్.