అయినా ఈ చెత్త వాగుడు వాగటానికే పిలవని పేరంటానికి వచ్చావా అంటుంది వేద. అంత కర్మ నాకు పట్టలేదు యశోద పిలిస్తేనే వచ్చాను అంటుంది మాళవిక మేము ఇద్దరం విడిపోయిన ఇప్పటికీ మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది. కలిసి ఉన్నప్పటికీ మీ ఇద్దరి మధ్యన ఆగాధం ఉంది. శరీరాలు కలవని పెళ్లి ఎప్పటికైనా పెటాకులు కాక తప్పదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక.మరోవైపు డయాస్ మీద మాట్లాడుతున్న యష్ నా గురించి చక్కగా మాట్లాడారు కానీ నిజం ఏంటంటే కలలు ఎప్పటికీ నిజం కావు, ఒకవేళ అలా జరిగినా వాటిని నాశనం చేయడానికి మన పక్కన ఎవరో ఒకరు ఉంటారు. లైఫ్ ఎప్పుడు ఉజ్వలంగా ఉండదు, ఉజ్వల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తుని మనం మార్చుకోకూడదు. ఆలోచిస్తే జీవితం మొత్తం చీకటి కలే.