Arjun S/o Vyjayanthi: కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన మూవీ `అర్జున్ సన్నాఫ్ వైజయంతి`. ప్రదీప్ చిలుకూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలైన విజయం తెలిసిందే. కళ్యాణ్ రామ్, విజయశాంతిల మధ్య తల్లి కొడుకు ఎమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
యాక్షన్ ప్రధానంగా సాగే మూవీ ఇది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. సినిమా కలెక్షన్ల పరంగానూ స్పందన అలానే ఉంది. మొదటి వీకెండ్‌లో బాగానే ఉంది.
కానీ సోమవారం నుంచి కాస్త స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. ఆడియెన్స్ థియేటర్ కి రావడానికి ఆసక్తి చూపించలేకపోవడం కూడా ఈ మూవీకి కొంత మైనస్‌గా మారింది. దీంతో ఆ బాక్సాఫీసు స్ట్రగుల్ మరింత పెరుగుతుంది.