ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం చూసుకుంటే మహేష్ బాబు కలర్, ఫిట్ నెస్ కు లేడీ ఫ్యాస్స్ ఫిదా అయిపోతుంటారు. ఇప్పుడంటే సూపర్ స్టార్ అంటున్నారు కాని.. మహేష్ బాబుకు ముందు ప్రిన్స్ అన్న పేరు ఉండేది, ఆ విషయం అందరికి తెలుసు.
ఇక 40 ఏళ్లు దాటిన వయస్సులో కూడా మహేష్ బాబు మహర్షి లాంటి సినిమాల్లో స్టూడెంట్ పాత్రలు చేశాడంటే, ఆయన మెయింటేనెస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మహేష్ బాబు ఫుడ్ హ్యాబిడ్స్ గురించి ఓ సందర్భంలో చెప్పారు.
ఆయన డైరీ పదార్ధాలు అస్సలు ముట్టుకోరు. పాలు, పెరుగు, నెయ్యి, బ్రెడ్, పీజ్జా, ఇలా ఏది ఆయన తినరు. ఇక మిగతా అన్ని తింటారు కాని, మితంగా తింటారు. ఏదైనా ఒకటి రెండు కంటే ఎక్కవ తీసుకోరట.
Also Read: నయనతార వల్ల 50 కోట్లు నష్టపోయిన నెట్‌ఫ్లిక్స్ ? అసలు సంగతి ఏంటంటే?