Sunitha
పాడుతా తీయగా షోలో ప్రవస్తి వివాదం కారణంగా సింగర్ సునీత గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్నారు. తనపై సింగర్ సునీత వివక్ష చూపారని, బాడీ షేమింగ్ కి గురిచేశారంటూ ప్రవస్తి అనేక సంచలన ఆరోపణలు చేశారు. ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా సింగర్ సునీత గురించి అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సునీత కేవలం గాయని మాత్రమే కాదు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయ్యారు. సౌందర్య, రాశి, త్రిష, కత్రినా కైఫ్, స్నేహ, కమలినీ ముఖర్జీ లాంటి క్రేజీ హీరోయిన్లందరికీ సునీత డబ్బింగ్ చెప్పారు. సునీత టాలీవుడ్ లోకి గులాబీ చిత్రంతో సింగర్ గా అడుగుపెట్టారు. ఆ చిత్రంలో సునీత పాడిన 'ఈ వేళలో నీవు' అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. దీనితో ఒక్కసారిగా సునీత క్రేజీ సింగర్ గా మారిపోయారు.
ఆ తర్వాత తమ్ముడు, బద్రి, యువరాజు, మురారి లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. దీనితో సునీత స్టార్ సింగర్ గా మారిపోయారు. గోదావరి, అతడే ఓకే సైన్యం చిత్రాలకు ఆమె ఉత్తమ గాయనిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. కమెడియన్ అలీతో పాల్గొన్న అలీతో సరదాగా అనే షోలో సునీత తన గురించి అనేక విషయాలు బయట పెట్టారు.
మీకు ఫస్ట్ క్రష్ ఎవరు అని అలీ ప్రశ్నించగా.. సునీత సమాధానం ఇచ్చారు. ఎవరైనా టాలీవుడ్ లో హీరో పేరుచెబుతారు అనుకుంటే సునీత ఊహించని షాక్ ఇచ్చారు. తనకి బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ పై అప్పట్లో క్రష్ ఉండేది అని సునీత తెలిపారు. ఆయనతో ఏజ్ గ్యాప్ ఉంది అని నాకు తెలుసు. కానీ చూడగానే ఎందుకో నాకు నచ్చేశారు అని సునీత తెలిపింది.