అర్జున్ రెడ్డి సీక్వెల్ కు రంగం సిద్ధం, విజయ్ దేవరకొండ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా?

Published : Feb 08, 2025, 03:47 PM IST

Arjun Reddy Sequel: గెట్ రెడీ రౌడీ ఫ్యాన్స్.. అర్జున్ రెడ్డి మరోసారి సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబో మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు రాబోతోంది..?  

PREV
16
అర్జున్ రెడ్డి సీక్వెల్ కు రంగం సిద్ధం, విజయ్ దేవరకొండ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మరో సినిమా?

Arjun Reddy Sequel with Vijay Deverakonda and Sandeep Reddy Vanga:  విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డివంగా డైరెక్ట్ చేసిన ఆసినిమా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. విజయ్ దేవరకొండ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. చిన్న హీరోగా..సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ.. ఈసినిమాతో ఒక్క సారిగా మాస్ హీరోగా అవతారం ఎత్తాడు. ఈసినిమాలో విజయ్ రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో ఆయన చేసే  పనులు.. ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతే కాదు యూత్ ను ఈ సినిమా ఊర్రూతలూగించింది. 

Also Read: చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్?
 

26

పిచ్చెక్కిపోయారు యంగ్ స్టార్స్. విజయ్ కు లేడీ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. విజయ్ ను పిచ్చిగాప్రేమించడంమొదలు పెట్టారు. అర్జున్ రెడ్డి సినిమా వల్ల అటు విజయ్ కు ఇటు సందీప్ రెడ్డికి ఇద్దరికి డిమాండ్ పెరిగిపోయింది. సందీప్ రెడ్డి ఆ ఇమేజ్ ను వాడుకుని బాలీవుడ్ ను దున్నేస్తున్నాడు. ఇక విజయ్ మాత్రం ఆసినిమా తరువాత చేసిన గీత గోవిందం తప్పించి... ఆతరువాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ లు అవ్వడంతో విజయ్ ఇమేజ్ కాస్త గట్టిగానే డ్యామేజ్ అయ్యింది. 

Also Read: అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన

36
Vijay Devarakonda, Vd14, Rahul Sankrityan, Mythri moviemakers

ప్రస్తుతం విజయ్ ను చాలా వరకూ ఆడియన్స్ మర్చిపోయారనేచెప్పాలి.  సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకోండ.. చాలా ప్రయత్నాలు చేశాడు.  ఎన్నో ప్రయోగాలు కూడా చేశాడు.  ప్రతీ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. కాని సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. మునుపటి క్రేజ్ ను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.

Also Read: బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్, ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

46

 తన హిట్ డైరెక్టర్లను కూడా రిపిట్ చేస్తున్నాడు. గీత గోవిందం సినిమాతో తనకు సూపర్ హిట్ అందించిన పరశురామ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు విజయ్. కాని ఈసినిమా కూడా రౌడీ హీరోకు ఊరటను ఇవ్వలేకపోయింది. దాంతో తన ఉనికిని కాపాడుకోవడం కోసం విజయ్.. మళ్ళీ అర్జున్ రెడ్డి కాంబినేషన్ ను రిపిట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో అర్జున్ రెడ్డి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.

56

 కాని.. ప్రస్తుతానికి ఇది రూమర్ గానే ఉంది. అయితే ఇది నిజమైనా.. ఈ కాంబినేషన్ ఇప్పట్లో కలిసే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా వరుస సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. అటు ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ త్వరలో స్టార్ట్ కాంబోతోంది. అది జరుగుతుండగానే అల్లు అర్జున్ తో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈరెండింటి తరువాత మెగాస్టార్ చిరంజీవితో కూడా సందీప్ రెడ్డి సినిమా చేయాల్సి ఉంది. 

66
Vijay Devarakonda,

ఇలా వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు ఉండటంతో.. విజయ్ దేవరకోండ తో సినిమా చేయాలి అంటే చాలా టైమ్ పట్టేఅవకాశం కనిపిసతుంది. అది కూడా అర్జున్ రెడ్డి సీక్వెల్ అంటే సినిమాపై చాలా ఎక్స పెక్టేషన్స్ ఉంటాయి. దానికోసం చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకోసం టైమ్ పట్టే అవకాశం ఉంది. అందుకే  ఈసినిమా ఇప్పట్లో సాధ్యం అయ్యే అవకాశం లేదు అంటున్నారు సినిమా జనాలు. మరి ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories