బ్రూస్ లీ, రుద్రమ దేవి చిత్రాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. రుద్రమదేవి చిత్రం 2015 అక్టోబర్ 9న రిలీజ్ కాగా,, బ్రూస్ లీ చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ అయింది. దీనితో రుద్రమ దేవి చిత్రం చాలా థియేటర్లు కోల్పోవలసి వచ్చింది. రుద్రమదేవి చిత్రం బాగా ఆడుతున్న సమయంలో బ్రూస్ లీ చిత్రాన్ని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని దాసరి అన్నారు. మరో వారం ఆలస్యంగా బ్రూస్ లీ వచ్చి ఉంటే రుద్రమదేవి చిత్రానికి మంచి వసూళ్లు వచ్చేవి అని తెలిపారు. స్టార్ హీరోల చిత్రాలకు పండుగలు అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ. చేతకాని వాళ్ళు మాత్రమే తమ చిత్రాలని పండుగలకు రిలీజ్ చేద్దాం అనుకుంటారు అంటూ దాసరి విమర్శలతో విరుచుకుపడ్డారు.