గేమ్ ఛేంజర్: పవన్ కళ్యాణ్ కి ఉన్న షాకింగ్ లింక్

First Published | Nov 21, 2024, 3:59 PM IST

రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాకి, పవన్ కళ్యాణ్ కి ఒక ఆశ్చర్యకరమైన సంబంధం ఉంది. ఈ సినిమాకి హీరోగా మొదట పవన్ కళ్యాణ్ ని అనుకున్నారని, కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో రామ్ చరణ్ కి ఈ అవకాశం వెళ్ళిందని తెలుస్తోంది.

pawan kalyan, #Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


కొన్ని విషయాలు బయిటకు వస్తే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి పవన్ కళ్యాణ్ కు, గేమ్ ఛేంజర్ సినిమాకు ఉన్న ఇంట్రస్టింగ్ లింక్. అదేంటో ఇప్పుడు చూద్దాం.  రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న తాజా చిత్రం  ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) అప్ డేట్స్ గురించి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే దాదాపు షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్  అప్‌డేట్  కోసం రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయి. తాజాగా ఓ విషయం పవన్ అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఏమిటా విషయం.

Game Changer


ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకుని నిర్మిస్తున్న చిత్రం ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్‌ వినిపిస్తోంది.

రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
 


Game Changer Teaser


 'గేమ్‌ ఛేంజర్‌' షూటింగ్‌ పూర్తి చేసుకున్నప్పటికీ రిలీజ్‌ డేట్‌ మాత్రం కాస్త ముందుకు జరుపుతూ వస్తున్నారు. అయితే అన్ని ఆటంకాలు అధిగమించి త్వరలోనే అంటే జనవరి 10న 'గేమ్‌ ఛేంజర్‌' విడుదల కాబోతోందని మేకర్స్‌ తెలపడంతో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్‌ 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అప్‌డేట్‌ తెలుస్తోంది. 


'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కాకినాడ లేదా చుట్టు ప్రక్కన నిర్వహిస్తున్నారని సమాచారం అందింది.  అయితే  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చేస్తారని అంటున్నారు. అయితే  ఆల్రెడీ కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ఈవెంట్‌ చేసేందుకు కొన్ని గ్రౌండ్స్‌ 'గేమ్‌ ఛేంజర్‌' యూనిట్ నుంచి నిర్వాహకులు పరిశీలించారు. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రానున్నారు.

ఈ చిత్రానికి, పవన్ కళ్యాణ్ కు మధ్య ఫ్యామిలీ కనెక్షన్ కాకుండా..మరొకటి ఉందని తెలుస్తోంది. అది మరేదో కాదు...ఈ సినిమాకు హీరోగా మొదట పవన్ కళ్యాణ్ ని అనుకునే శంకర్ కథ రెడీ చేసారట. దిల్ రాజు కూడా ప్రొడ్యూస్ చేయటానికి ఉత్సాహం చూపించారు. కానీ పవన్ తాను తనకున్న కమిట్మెంట్స్ తో కంటిన్యూగా డేట్స్ ఇవ్వలేనని  చెప్పటంతో అప్పుడు రామ్ చరణ్  దగ్గరకు వెళ్ళిందట ఈ ప్రాజెక్టు. అయితే ఈ విషయం బయిటకు రానివ్వలేదట. 


  ఈ సినిమా గురించి శంకర్‌  మాట్లాడుతూ.. ‘‘నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఎట్టకేలకు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైంది’’ అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు.

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’. చరణ్‌ ద్విపాత్రాభినయం చేసినట్టు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌. శ్రీకాంత్‌, ఎస్‌.జె. సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే మేకర్స్ ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.  

Latest Videos

click me!