ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేయ్ అని పొగరుగా మాట్లాడుతుంది అప్పు. కళ్యాణ్ వాటన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతాడు. మొదటినుంచి ఆ అబ్బాయి మనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు మంచి మనిషిని బాధ పెట్టావు అని మందలిస్తుంది కనకం. కృష్ణమూర్తి, అప్పు పెద్దమ్మ కూడా అప్పుని మందలిస్తారు. మరోవైపు రాజ్ దగ్గరికి వచ్చిన వాళ్ల పనిమనిషి బాబు స్కూల్ ఫీజు ఇస్తానన్నారు అని అడుగుతుంది. కావ్యని పిలిచి డ్రాయర్ సొరుగు లో డబ్బులు పెట్టాను కదా అందులోంచి 20,000 తీసి తనకు ఇవ్వు అని చెప్తాడు రాజ్.