తీరొక్క డ్రెస్ లో రష్మీ గౌతమ్ కిర్రాక్ సెల్ఫీలు.. అదిరిపోయే లుక్స్ లో అట్రాక్ట్ చేస్తున్న స్టార్ యాంకర్

First Published | Jul 14, 2023, 8:24 AM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam)  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంటోంది. మరోవైపు క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తోంది. 
 

స్మాల్ స్క్రీన్ పై స్టార్ యాంకర్ గా రష్మీ గౌతమ్ ఎంత సందడి చేసిందో తెలిసిందే. యాంకరింగ్ స్కిల్స్, అందంతో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. పదేళ్లుగా బుల్లితెరపై మెరుస్తూనే వస్తోంది. 
 

ఆ మధ్యలో రష్మీ గౌతమ్ నెట్టింట కాస్తా అరుదుగా పోస్టులు పెట్టింది. వరుస షోలు, అటు సినిమాలతో బిజీగా ఉండటంతో నెట్టింట దర్శనం కరువైంది. ఇటీవల మళ్లీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ సందడి చేస్తోంది.
 


ఇప్పటికే రోజూ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్ తాజాగా క్రేజీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. కిర్రాక్ సెల్ఫీ ఫొటోలను షేర్ చేసుకుంది. డిఫరెంట్ అవుట్ ఫిట్లలో రష్మీ గౌతమ్ మిర్రర్ సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకుంది.
 

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. సింపుల్ లుక్స్ లో రష్మీ క్యూట్ గా సెల్ఫీలకు ఫోజులిచ్చింది. బ్యూటీఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంది. తను గతంలో దిగిన సెల్ఫీలను ఒకేసారి ఫ్యాన్స్  ముందు వీడియో రూపంలో ఉంచింది.
 

రష్మీకి ఎప్పుడూ నెట్టింట మంచి సపోర్ట్ లభిస్తూనే ఉంటుంది. తన పోస్టులను ఫ్యాన్స్ క్షణాల్లోనే వైరల్ చేస్తుంటారు. మరోవైపు రష్మీ సోషల్ అంశాలపైనా స్పందించినా మద్దతుగా నిలుస్తుంటారు. ఇక లేటెస్ట్ పోస్ట్ నూ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ఇక రష్మీ యాంకర్ గా అవతారం ఎత్తడానికి ముందు నటిగా పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. ఆయా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో అలరించింది. చివరిగా ‘జబర్దస్త్’ కామెడీ షోకు యాంకర్ గా వచ్చి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.  
 

యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత నటిగానూ మెప్పించింది. ఇటు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే అటు హీరోయిన్ గా సినిమా అవకాశాలను అందుకుంది. పలు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. 
 

‘గుంటూరు టాకీస్’, ’నెక్ట్స్ నువ్వే’, ‘అంతకు మించి’ చిత్రాల్లో నటించి మెప్పించింది. మరిన్ని సినిమాల్లో కీ రోల్స్ లో మెరిసింది. ప్రస్తుతం లీడ్ యాక్ట్రెస్ గా రష్మీ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో మాత్రం ముఖ్య పాత్రలో అలరించబోతోంది.  
 

Latest Videos

click me!