మా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో రిషి, వసుధారలు పనిచేస్తే ఆ ప్రాజెక్టు మరింత సక్సెస్ అవుతుందని మా అభిప్రాయము వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు మీ కాలేజీలో ఉంటూనే వాళ్ళు ఈ పని చేయవచ్చు ఎలాగైనా వాళ్ళని ఈ పని కోసం మీరు ఒప్పించండి అని రిక్వెస్ట్ చేస్తుంది జగతి. ఆమె కోరిక కి ఫస్ట్ షాక్ అవుతారు విశ్వనాథం, ప్రిన్సిపల్. అన్ని ఆలోచన బానే ఉంది కానీ ఒకసారి రిషి సార్ తో మాట్లాడి అప్పుడు మీకు ఏ విషయం చెప్తాను అంటాడు ప్రిన్సిపల్. టైం తీసుకున్నా పర్వాలేదు అంటుంది జగతి.