కౌంటింగ్ రోజు నుంచి అకీరా వార్తల్లో నిలుస్తున్నాడు తన పిన్ని అన్నా లెజినోవాతో కలిసి విజయానందం పంచుకోవడం.. దగ్గర నుంచి గెలుపు రోజు చంద్రబాబుతో భేటీ.. ప్రధానితో భేటీ.. చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవాడం. ఇలా పవన్ ప్రతీ అడుగులో వెంట అకీరా కనిపించాడు. దాంతో అకీరా పాత్ర ఇక అఫీషియల్ అయినట్టు చెప్పకనే చెప్పాడు పవర్ స్టార్. ఇక ఎంట్రీ ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది.