పెళ్లైన హీరోతో సప్తమి గౌడ ఎఫైర్‌?.. నటుడి భార్య సంచలన ఆరోపణలు.. కోర్ట్ కెళ్లిన `కాంతార` హీరోయిన్‌..

Published : Jun 16, 2024, 10:37 AM ISTUpdated : Jun 16, 2024, 10:39 AM IST

`కాంతార` తో ఫేమస్‌ అయిన సప్తమి గౌడ ప్రస్తుతం అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు ఆమె యంగ్‌ హీరో భార్యపై కోర్టు మెట్లు ఎక్కింది. ఇదే ఇప్పుడు కన్నడనాట హాట్‌ టాపిక్‌ అవుతుంది.

PREV
17
పెళ్లైన హీరోతో సప్తమి గౌడ ఎఫైర్‌?.. నటుడి భార్య సంచలన ఆరోపణలు.. కోర్ట్ కెళ్లిన `కాంతార` హీరోయిన్‌..

`కాంతార` చిత్రంతో సౌత్‌లో పాపులర్‌ అయ్యింది సప్తమి గౌడ. ఆమె డీ గ్లామర్‌ రోల్‌లో అదరగొట్టింది. డస్కీ అందంతో కనువిందు చేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది సప్తమి గౌడ. తెలుగులోనూ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. తాజాగా ఆమె కోర్టు మెట్లెక్కింది. హీరో భార్య విషయంలో ఆమె కోర్ట్ కి వెళ్లడం గమనార్హం. మరి ఇంతకి ఏం జరిగిందంటే?
 

27

`కాంతార` సినిమా తర్వాత సప్తమి గౌడ క్రేజ్‌ పెరిగింది. హిందీతోపాటు సౌత్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. కన్నడలోనూ బిజీ అయ్యింది. అయితే ఆమె శివరాజ్‌ కుమార్‌ ఫ్యామిలీకి చెందిన యువరాజ్‌ తో ఎఫైర్‌ నడిపిస్తుందనే ఆరోపణలు శాండల్‌ వుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ ఇద్దరు రహస్య వ్యవహారం నడిపిస్తున్నారట. ఈ వ్యవహారం ఆ హీరో భార్యకి తెలిపింది. దీంతో ఆమె రచ్చ చేసింది. 
 

37

ఇటీవల యువరాజ్‌ తన భార్య శ్రీదేవిని విడాకులు కోరాడు. తన భార్య తనని వేధిస్తుందని విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ఆయన కోర్ట్ ద్వారా విడాకులు కోరినట్టు తెలిసింది. అయితే దీనిపై యువరాజ్‌ భార్య స్పందించింది. ఆమె షాకింగ్‌ ఆరోపణలు చేసింది. తన భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. సప్తమి గౌడపై సంచలన ఆరోపణలు చేసింది. 
 

47

సప్తమి గౌడ, యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది భార్య శ్రీదేవి బైరప్ప. తాను అమెరికా వెళ్లినప్పుడు యువరాజ్‌, సప్తమి కలిసి జీవించారని ఆమె ఆరోపించింది. సప్తమి గౌడ కోసం తనని ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపుతున్నాయి. ఇవి సంచలనంగా మారిన నేపథ్యంలో సప్తమి గౌడ రివర్స్ కౌంటర్‌ ఇచ్చింది. 
 

57

ఈ విషయంపై ఆమె సీరియస్‌ అవ్వడంతోపాటు కోర్టులో కేసు వేశారు. శ్రీదేవి భైరప్ప తనపై నెగిటివ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని, తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది. శ్రీదేవి భైరప్ప పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు ఆమెపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది. దీంతో  శ్రీదేవి భైరప్పకు నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. మరోవైపు యువరాజ్‌, శ్రీదేవి బైరప్ప ఫ్యామిలీ కోర్ట్ లో విడాకులకు అప్లై చేసుకోవడం గమనార్హం. మరి ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి. 
 

67

ఇదిలా ఉంటే `పాప్‌ కార్న్ మంకీ టైగర్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సప్తమి గౌడ. `కాంతార` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో లీల పాత్రలో లేడీ పోలీస్‌గా కనిపించింది. హీరోకి లవర్‌గా అదరగొట్టింది. డీ గ్లామర్‌ లుక్‌లో మెరిసింది. ఆ తర్వాత ఇటీవల హిందీలో `ది వ్యాక్సిన్‌ వార్‌` చిత్రంలో మెరిసింది. 
 

77

దీంతోపాటు కన్నడలో `యువ` అనే చిత్రంలో నటించింది. ఇందులో యువరాజ్‌ హీరో కావడం విశేషం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్‌ పెరిగిందని, అది ఎఫైర్‌కి దారి తీసిందనేది యువరాజ్‌ భార్య ఆరోపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories