Allu Arjun
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం పాలిటిక్స్ అని అంటున్నారు.
Allu Arjun
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన విధానం వల్ల మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య చీలిక వచ్చిందంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల వెళ్లి తన స్నేహితుడు అంటూ శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలపడం ఈ వివాదానికి కారణం అయింది. శిల్పా రవి వైసిపి పార్టీ కావడంతో జనసేనలో ఉన్న మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలలో శిల్పా రవి ఓటమి చెందారు. దీనితో బన్నీ వెళ్లి ప్రచారం చేసినా గెలవలేదు అంటూ మరోసారి మెగా అభిమానులు ట్రోలింగ్ కి దిగారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. అదొక వివాదం అయింది.
ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాలతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య నిజంగానే ఏదో జరుగుతోంది అంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ డైరెక్ట్ గా స్పందించలేదు. అల్లు అర్జున్ కూడా సైలెంట్ గా ఉన్నాడు.
ఈ తరుణంలో అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. బన్నీ తన తండ్రి అల్లు అరవింద్ పై ప్రేమ చాటుతూ ఎమోషనల్ పిక్ ఒకటి పోస్ట్ చేశారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్.. అల్లు అరవింద్ తో ఉన్న ఫోటో షేర్ చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ పిక్ అల్లు అర్జున్ కి చెందిన AAA సినిమాస్ థియేటర్ లోనిది. అల్లు అర్జున్ AAA సినిమాస్ ని గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2లో నటిస్తున్నాడు.