Nithiin
యంగ్ హీరో నితిన్ కెరీర్ పరంగా జోరు పెంచాడు. మార్చి 28న నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం ఇది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక రిలీజ్ కి వారం కూడా టైం లేదు. దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నితిన్ ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఒక రేంజ్ లో హైప్ ఇస్తున్నాడు. బలగం వేణు దర్శకత్వంలో నటించబోతున్న ఎల్లమ్మ చిత్రం గురించి అయితే నితిన్ చేస్తున్న వ్యాఖ్యలు అంచనాలు పెంచేస్తున్నాయి. ఇండియన్ సినిమాలోనే గర్వించదగ్గ చిత్రం ఎల్లమ్మ అవుతుంది అని నితిన్ చెబుతున్నాడు. నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. వేణు చెప్పింది చెప్పినట్లు తీస్తే ఎల్లమ్మ చిత్రాన్ని తిరుగు ఉండదు అని నితిన్ అంటున్నాడు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గురించి తాజాగా క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ముందుగా ఈ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం చిత్రంతో బిజీగా ఉంది. దీనితో ఎల్లమ్మ చిత్రానికి డేట్లు ఇవ్వలేనని హ్యాండ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
keerthy suresh
ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మరో హీరోయిన్ ని వెతుక్కోక తప్పలేదు. సాయి పల్లవికి బదులుగా ఒక పెళ్ళైన హీరోయిన్ ని ఈ చిత్రంలోకి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు కీర్తి సురేష్. మహానటి చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ఈ చిత్రంలో పర్ఫెక్ట్ ఛాయిస్ అని బలగం వేణు భావిస్తున్నారట.
కీర్తి సురేష్, నితిన్ ఆల్రెడీ రంగ్ దే చిత్రంలో నటించారు. ఆ మూవీలో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక కీర్తి సురేష్ కి పెళ్ళైన తర్వాత ఇదే తొలి తెలుగు చిత్రం కాబోతోంది. ఈ మూవీ రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లునితిన్ రివీల్ చేశారు.