లైనప్ మార్చేసిన అనుష్క.. మళ్లీ పవర్‌ఫుల్ రోల్‌లో స్వీటీ!

Published : Sep 01, 2025, 03:16 PM IST

Anushka Shetty: అనుష్క శెట్టి తన కెరీర్ లైనప్ మార్చేసినట్లు అనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ ప్రాధాన్యత ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. రాబోయే సినిమాలో కూడా మరోసారి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట.

PREV
15
కొత్త లైనప్ లో అనుష్క

Anushka Shetty: లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి తన కెరీర్ లైనప్ మార్చేసిందా? అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ ప్రాధాన్యత ఇచ్చిన ఈ అమ్మడు. ఇటీవల కాలంలో లేడీ ఓరియంట్ సినిమాల్లో, పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తోంది. అతి త్వరలో ఘాటి మూవీతో ప్రేక్షకులను భయపెట్టబోతున్న అనుష్క. రాబోయే సినిమాలో కూడా మరోసారి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారట. అది కూడా కొత్త ఇండస్టీలో. ఇంతకీ ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు? ఇంతకీ ఆ సినిమా ఏంటీ?

25
ఘాటి పైనే ఆశలు

లేడీ సూపర్‌స్టార్ అనుష్క- డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఘాటి. ఈ మూవీలో అనుష్క పవర్ ఫుల్ యోధురాలిగా నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో అనుష్క మరోసారి లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క రాకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది

35
‘ఘాటి’ తర్వాత మరో పవర్ ఫుల్ రోల్

ఇక ‘ఘాటి’ సినిమా తరువాత అనుష్క మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతుంది. అది కూడా మలయాళ సినిమాలో. మాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాతో అనుష్క అరంగేట్రం చేయనుంది. ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందిస్తుండగా, జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే.. జయసూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో ఓ వ్యక్తి పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మాంత్రికుడిలా కనిపించారు. ఆ లుక్ పూర్తిగా మిస్టీరియస్‌గా చూపించి, సినిమా మీద ఆసక్తిని మరింత పెంచింది మూవీ టీం. ఈ మూవీ 9వ శతాబ్దానికి చెందిన మాంత్రికుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ‘మీ సమయాన్ని, మీ మనస్సును, మీ రియాలిటీని దొంగలించేవాడు’ అన్న క్యాప్షన్‌తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మాయ శక్తుల చుట్టూ తిరిగే ఈ ఫాంటసీ థ్రిల్లర్‌లో అనుష్క కీలక పాత్ర పోషించనుండటం మరింత ఆసక్తి రేపుతోంది. అనుష్క మెయిన్ రోల్ నటించబోతుండటంతో ఈ మూవీకి మాలీవుడ్‌లోనే కాదు, ఇతర భాషల్లో చర్చనీయంగా మారింది.

45
లైనప్ మార్చుతున్న అనుష్క

కింగ్ నాగార్జున- పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కించిన ‘సూపర్’మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది నటి అనుష్క శెట్టి. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చిన అమ్మడు.. ‘అరుంధతి’సినిమాతో తన ట్రాక్ మార్చేసింది. జేజమ్మ పాత్రతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అనుష్క. ఈ సినిమా ఆ తరువాత అడపదడప గ్లామర్ రోల్స్ చేసినా.. ఎక్కవ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో ‘బాహుబలి’లో దేవసేనగా సూపర్‌ ఇంపాక్ట్ చూపించిన అనుష్క,

55
మాలీవుడ్ లోకి ఎంట్రీ

కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత ‘మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి’తో పరవాలేదనిపించినా, ఆ మూవీ అంత పెద్ద హిట్ కాలేదు. ఈ క్రమంలో స్వీటీ తన లైనప్ మార్చుతూ స్టోరీ ప్రాధాన్యం, లేడీ ఓరియెంటెడ్ రోల్స్‌నే ఎంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వరుసగా ఘాటి, కథనార్ లాంటి పవర్ ఫుల్ మూవీస్‌లో ఆమె కనిపించబోతున్నారు. ఈ తరుణంలో మలయాళ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయమవుతుందని ఇండస్ట్రీ టాక్.

Read more Photos on
click me!

Recommended Stories