తొలి చిత్రంతోనే ఎందుకు యాక్టింగ్ ఆపేయాల్సి వచ్చింది, ఆ తర్వాత అవకాశాలు రాలేదా అనే ప్రశ్నపై సుప్రియ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫారెన్ లో చదువుకుని వచ్చాక సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఒకసారి అల్లు అరవింద్ గారు కనిపించారు. ఏవమ్మాయ్.. సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. నేను ఒకే అని చెప్పాను. ఆ విధంగా అల్లు అరవింద్ గారి నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో నా ఫస్ట్ మూవీ ప్రారంభమైంది.