Pushpa – Ghaati Crossover: ఘాటి లోని శీలావతి, పుష్ప మూవీస్ లోని పుష్ప రాజ్ ఇద్దరూ కలసి క్రాస్‌ఓవర్ సినిమాలో వస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించగా హీరోయిన్ అనుష్క ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. ఇంతకీ స్వీటీ రిప్లే ఏంటీ?
Anushka Shetty: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత మరోసారి ఓ పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. గతంలో బాహుబలి, అరుంధతి వంటి పవర్‌ఫుల్ రోల్స్ నటించి విషయం తెలిసిందే. తాజాగా ‘ఘాటి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనుష్క.
ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప రాజ్- శీలావతి క్రాస్‌ఓవర్’అనే ఐడియాపై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ ఇంతకీ స్వీటీ కామెంట్స్ ఏంటీ?
25
ఘాటిపై భారీ హైప్
ఇప్పటికే ఘాటి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌తోపాటు అనుష్క లుక్ బాగా హైప్ క్రియేట్ చేశాయి. ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనుష్క స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఫ్యాన్ భావిస్తున్నారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈసారి తన పంథాకు భిన్నంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించగా, సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు ఘాటి చిత్రానికి కథ అందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
35
‘పుష్ప రాజ్- శీలావతి క్రాస్‌ఓవర్’
Pushpa – Ghaati Crossover: ఇక ఈ సినిమా అనుష్కగంజాయి స్మగ్లర్‌గా నటించినట్టు తెలుస్తోంది. తొలుత గంజాయి మాఫియాకు సపోర్టుగా నిలుస్తుంది. ఆ తర్వాత తన తప్పు గ్రహించి మారిపోతుంది. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే ‘షీలావతి’ పాత్రలో అనుష్క నటించారు. మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ‘పుష్ప రాజ్’పాత్ర ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ, ఆ తర్వాత పెద్ద మాఫియాలకు ఎదురు నిలిచే పాత్రలో కనిపించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య పోలికలు చూపిస్తూ.. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు హాల్చల్ చేస్తున్నాయి. పలు కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Pushpa – Ghaati Crossover: తాజాగా ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ అనుష్క ఓ టెలిఫోన్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా అనుష్కను ఓ జర్నలిస్టు ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘ఘాటి లోని షీలావతి – అల్లు అర్జున్ పుష్పలోని పుష్ప రాజ్ క్యారెక్టర్లను కలిపి ఓ క్రాస్‌ఓవర్ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.
అనుష్క సమాధానమిస్తూ.. ‘ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా. అలాంటి కాంబినేషన్ అయితే ఆడియన్స్‌కి మామూలు థ్రిల్ కాదు. శీలావతి తన లవర్ దేశిరాజుతో (విక్రమ్ ప్రభు) కలిసి గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. మరోవైపు పుష్ప రాజ్ కూడా పెద్ద మాఫియాలకు ఎదురు నిలుస్తాడు. ఇలాంటి రెండు శక్తివంతమైన పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనబడితే అదిరిపోతుంది” అని అన్నారు.
ప్రసుత్తం అనుష్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు అల్లు ఫ్యాన్స్, ఇటు స్వీటీ ఫ్యాన్స్ ‘పుష్ప రాజ్- శీలావతి క్రాస్‌ఓవర్” ఐడియా నిజమైతే బ్లాక్‌బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
55
డైరెక్టర్ కామెంట్స్..
అంతకుముందు దర్శకుడు క్రిష్ కూడా పుష్ప, ఘాటి సినిమాల మధ్య తేడాలను వివరిస్తూ ‘పుష్ప ఒక వ్యక్తి స్వాగ్‌ను చూపించే సినిమా. అల్లు అర్జున్, సుకుమార్ అద్భుతంగా క్రియేట్ చేశారు. కానీ ‘ఘాటి’ మాత్రం సమాజంలో ఉన్న గంజాయి సమస్యపై, దాని వెనక జరుగుతున్న ఘోరాలపై తీసిన సినిమా. ఈ సమస్యతో ఎంతోమంది బలైపోతున్నారు. అందుకే దీన్ని రియలిస్టిక్‌గా తెరకెక్కించాను” అని క్రిష్ చెప్పారు.
ఇకపోతే, అనుష్క పవర్‌ఫుల్ యాక్షన్ అవతారంలో కనిపించనున్న ఈ “ఘాటి” చిత్రం సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల అవుతోంది. మరి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని ఘాటి చిత్రంతో అనుష్క కొనసాగిస్తుందా..? అనేది చూడాలి.