అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

First Published | May 5, 2024, 9:22 AM IST

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేము. కొన్ని కాంబోలు అసలు సెట్ అయితాయి అని కూడా అనుకోలేము. కొన్నిమాత్రం అనూహ్యంగా సెట్ అయ్యి..మిస్ అవుతుంటాయి. అలాంటి కాంబోనే.. పవన్ కళ్యాణ్ - అనుష్క శెట్టి. 
 

ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆ చిత్ర విచిత్రాలు ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కాంబినేషన్ల విషయాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో సెట్ అవ్వబోయి మిస్ అయిన చిత్రకాంబో ఎంటో తెలుసా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అనుష్క శెట్టి. 
 

Pawan Kalyan

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తాయి . అయితే ఆ సినిమాలో మొదటగా అనుకున్న హీరో హీరోయిన్ వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. మరి కొన్నిసార్లు ఆ పాత్ర చేయాలని ఉన్న కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉండొచ్చు.. రీసెంట్ గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. 

అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు.. హీరోయిన్ వితిక షెరు షాకింగ్ కామెంట్స్.
 


ఇక అసలు విషయం ఏంటంటే..అనుష్క శెట్టి – పవన్ కళ్యాణ్... వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావల్సి ఉంది. కొన్నికారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి అనుష్క శెట్టి తప్పుకోవల్సి వచ్చిందట. ముందుగా అనుష్క అనుకున్నారు.. కాని ఆమె తప్పుకోవడంతో.. హీరోయిన్ ను మార్చేశారట. మేకర్స్.. ఇంతకీ ఆ సీనిమా ఏంటీ..? మార్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

ఆ సినిమా ఏదో కాదు..  పవన్ కళ్యాణ్ కెరియర్ లో మంచి సినిమాగా నిలిచిన  బంగారం సినిమా. ఈసినిమాలో ముందుగా హీరోయిన్ గా అవకాశం అందుకుంది అనుష్క శెట్టి. అయితే ఇది చాలా  చిన్న క్యారెక్టర్.. కావడంతో అనుష్క ఈ అవకాశాన్ని వదిలేసుకుందట. చిన్న క్యారెక్టర్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా...? అదే అండీ.. క్లైమాక్స్ సీన్ లో .. లాస్ట్ మినిట్లో త్రిష ట్రైన్ ఎక్కుతుంది.. అప్పుడు పవన్ కళ్యాణ్  చేయి అందిస్తాడు కదా.. 

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?

స్టార్ హీరోయిన్ తో ఆ ఒక్క సీన్ ఉంటుంది .ఆ సీన్ డైరెక్టర్ అనుష్క శెట్టితో ఊహించుకున్నాడట . అయితే అనుష్క శెట్టి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. కేవలం ఒక్క సీన్ కోసం నటించాలా..? అంటూ అనుష్క శెట్టి ఈ సినిమా ఆఫర్ ను వదులుకునిందంట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది కూడా. 

అంతే కాదు  అనుష్క శెట్టి. . తీసుకున్న నిర్ణయం అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది కూడా. ఇక అలా వీరిద్దరి కాంబోలో సినిమా మిస్ అయ్యింది. ఆతరువాత అసలు వీరి కాంబినేషన్ లో సినిమా చేయాలని ఎవరికీ ఆలోచన కూడా రాలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు పవన్. మూడు సినిమాలు సెట్స్ పై ఉండగా.. ఎలక్షన్ తరువాత అవి కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్.  
 

ఇక అనుష్క శెట్టి మాత్రం రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చి.. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంది. కాని అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడంలేదు అనుష్క శెట్టికి. 40 ఏళ్లు దాటినా.. ఇంకా బ్యాచిలర్ గానే ఉంది స్వీటి. 

Latest Videos

click me!