Anushka Favorite Food: అనుష్కకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? ప్రభాస్‌ ఇష్టంగా తినేదే స్వీటి కూడా

Published : Dec 30, 2025, 07:36 PM IST

Anushka Favorite Food: అనుష్క శెట్టి, ప్రభాస్‌ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతో గానీ, అనుష్క, ప్రభాస్ ల‌ ఫుడ్‌ టేస్ట్ మాత్రం సేమ్‌ కావడం విశేషం. 

PREV
15
ఘాటితో డిజప్పాయింట్‌ చేసిన అనుష్క

అనుష్క శెట్టి ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. కానీ ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది. ఇటీవల ఆమె `ఘాటి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. క్రిష్‌ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు.

25
అనుష్కకి ఇష్టమైన ఫుడ్‌

ఇదిలా ఉంటే అనుష్కకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తనకు ఇష్టమైన ఫుడ్‌ సీక్రెట్‌ తెలిసింది. ఓ పాత ఇంటర్వ్యూలో అనుష్క తనకు ఇష్టమైనవి వెల్లడించింది. అందులో తనకు ఇష్టమైన ఫుడ్‌ని ప్రత్యేకంగా మెన్షన్‌ చేసింది. అనుష్క చూడ్డానికి, తన మనసు చాలా స్వీటి, కానీ ఆమెకి ఇష్టమైన ఫుడ్‌ చాలా హాట్‌ కావడం విశేషం.

35
ప్రభాస్‌కి ఇష్టమైనదే అనుష్కకి కూడా

అనుష్కకి నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టమట. నాన్‌ వెజ్‌ ఐటమ్స్ ని చాలా ఇష్టంగా తింటుందట. అందులోనూ రొయ్యలంటే చాలా ఇష్టమని చెప్పింది అనుష్క. తాను బయటకు ఎక్కడికి వెళ్లినా ఇష్టమైన ఫుడ్‌ బాగా తింటానని చెప్పింది. అందులో రొయ్యల వేపుడు అంటే పడి చస్తానని చెప్పింది. ప్రభాస్‌కి కూడా నాన్‌ వెజ్‌ అంటే ఇష్టం. అందులోనూ రొయ్యలు అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా యాదృశ్చికంగా అనుష్క, ప్రభాస్‌ ఫుడ్‌ టేస్ట్ లు కలవడం విశేషం. ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

45
అనుష్క ఫేవరేట్‌ ప్లేస్‌

ఇక అనుష్కకి ఇష్టమైన ప్రాంతాల్లో మన హైదరాబాద్‌ ఉండటం విశేషం. బెంగుళూరు, హైదరాబాద్‌ తనకు ఇష్టమైన ప్రాంతాలు అని చెప్పింది. ఎక్కువగా తాను హైదరాబాద్‌కి రావడానికి ఇష్టపడతానని వెల్లడించింది. ప్రకృతి అంటే ఇష్టం, ప్రకృతిపై రాసిన పుస్తకాలన్నా చాలా ఇష్టమట. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతానని చెప్పింది అనుష్క.

55
అనుష్కకి ఇష్టమైనవి

ఇంకా ఇష్టమైనవి చాలా చెప్పింది. దుస్తుల పరంగా జీన్స్, కార్గోస్‌, పంజాబీ డ్రెస్‌లు, అప్పుడప్పుడు చీరలంటే ఇష్టమని చెప్పింది. రంగుల విషయానికి వస్తే, నలుపు, తెలుపు, ఎరుపు ఇష్టమని చెప్పింది. ఆభరణాల గురించి చెబుతూ, చెవి రింగులు, నెక్లెస్‌లు ఇష్టమని పేర్కొంది. తన లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని విషయం గురించి చెబుతూ, తాను యోగా టీచర్‌ మారడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అని చెప్పింది స్వీటి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories