
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా వందల కోట్ల సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు చేసింది. `ఛావా` సుమారు ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రష్మిక సినిమాల కలెక్షన్లు వెయ్యి కోట్లకుపైగానే ఉంటాయని చెప్పొచ్చు. అయితే రష్మికని మించి మెప్పించింది అనుపమా పరమేశ్వరన్. చేసింది చిన్న బడ్జెట్ చిత్రాలే అయినా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంది. డిఫరెంట్ మూవీస్‌తో మెప్పించింది. ఇండియాలోనే మరే హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా ఈ ఏడాది సినిమాలు చేసి మెప్పించింది.
అనుపమా పరమేశ్వరన్ ఈ ఏడాది ఏకంగా ఏడు సినిమాలు చేయడం విశేషం. కానీ అందులో ఒకటి విడుదల వాయిదా పడింది. ఆమె చేసిన అన్ని చిత్రాలు కంటెంట్ బేస్డ్ మూవీస్ కావడం మరో విశేషం. ఎక్కడా గ్లామర్‌కి ఛాన్స్ లేదు. కానీ అద్భుతమైన నటనతో మెప్పించింది. డీ గ్లామర్ లుక్లో మెప్పించింది. కోట్ల ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంది. అనుపమా పరమేశ్వరన్ ఈ ఏడాది తమిళంలో `డ్రాగన్`తో తన సినిమాల జాతర స్టార్ట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇందులో హీరోకి లవర్‌గా లెక్చరర్‌గా నటించి మెప్పించింది.
ఆ తర్వాత మలయాళంలో `జేఎస్‌కే: జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళా` చిత్రంలో నటించింది. ఇది లైంగిక వేధింపులకు గురైన ఒక మహిళకి న్యాయం కోసం జరిగే కథతో రూపొందింది. ఇందులో లైంగిక బాధితురాలిగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే ఈ మూవీలో అనుపమా నటన కట్టిపడేస్తుంది. ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో అదరగొట్టింది అనుపమా. విశేష ప్రశంసలందుకుంది. ఇది టైటిల్ విషయంలో వివాదంలో నిలిచిన విషయం తెలిసిందే.
అనంతరం `పరదా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మూఢ ఆచారాలకు ఒక గ్రామం కేరాఫ్‌గా నిలుస్తుంది. ముఖంపై పరదా తీసేయడం వల్ల చోటు చేసుకున్న పరిణామాలు, దాని కారణంగా హీరోయిన్ ప్రాణాలే తీయాల్సి రావడంతో ఆ మూఢ సాంప్రదాయంపై హీరోయిన్ చేసిన పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. ఇది బాగానే ఆకట్టుకుంది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. ఇందులో అనుపమా నటన అదిరిపోయింది.
ఆ వెంటనే తెలుగులో హర్రర్ థ్రిల్లర్ `కిష్కిందపురి` మూవీలో నటించింది. ఇందులో హర్రర్ అడ్వెంచర్‌కి తీసుకెళ్లే హీరో టీమ్‌లో పనిచేస్తుంది. అదే సమయంలో దెయ్యంగా మారి మెప్పించింది. ఆమె పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగు లో బౌన్స్ బ్యాక్ అయ్యింది అనుపమా పరమేశ్వరన్. అలాగే మలయాళంలో `ది పెట్ డిటెక్టివ్` అనే కామెడీ ఫిల్మ్ చేసింది. ఈ చిత్రం మామూలుగానే ఆడింది. ఓటీటీలో మంచి ఆదరణ పొందింది.
ఇక తమిళంలో `బైసన్` అనే చిత్రంలో నటించింది. ఇందులో డీ గ్లామర్ లుక్‌లో మెరిసింది. విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ సరసన నటించి మెప్పించింది. ప్రేమ కోసం ఫైట్ చేసే అమ్మాయిగా అద్భుతమైన నటనని కనబరిచి ఆకట్టుకుంది. వాహ్ అనిపించింది. ఇందులో విక్రమ్ కంటే పెద్ద ఏజ్ అమ్మాయిగా అనుపమా నటించడం విశేషం. ఈ చిత్రం కూడా మంచి వసూళ్లని రాబట్టింది. ఇక ఇటీవల `లాక్ డౌన్` అనే చిత్రంలో నటించింది అనుపమా. లాక్ డౌన్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ మూవీ ఈ ఏడాది విడుదల కావాల్సింది, కానీ విడుదల వాయిదా పడింది. ఇందులోనూ ఇంటెన్స్ రోల్ చేసింది. ఇలా విభిన్నమైన సినిమాలు, విభిన్నరకాల పాత్రలతో మెప్పించింది. నటిగా విశ్వరూపం చూపించింది అనుపమా.