అరుంధతి రీమేక్.. అనుష్క స్థానంలో 24 ఏళ్ల యంగ్ సెన్సేషన్‌.. ఎవరో తెలుసా

Published : Oct 30, 2025, 08:16 AM IST

అనుష్క శెట్టి నటించి, సూపర్ హిట్ అయిన 'అరుంధతి' సినిమా బాలీవుడ్ లో రీమేక్‌కి ప్లాన్‌ జరుగుతుంది. అనుష్క పాత్ర కోసం  సెన్సేషనల్‌ హీరోయిన్‌ని అనుకుంటున్నారు.  

PREV
15
పెద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `అరుంధతి`

తెలుగులో 2009లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన మూవీ `అరుంధతి`. ఇందులో అనుష్క  శెట్టి ప్రధాన పాత్ర పోషించింది. కోడి రామకృష్ణ రూపొందించారు.  శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అనుష్క ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సోనూ సూద్, మనోరమ, సాయాజీ షిండే, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఝాన్సీ, దీపక్ లాంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.ఇందులో అనుష్క నట విశ్వరూపం చూపించింది. దీంతో సినిమా ఆ ఏడాది అతిపెద్ద హిట్‌గా నిలిచింది. విజయశాంతి మూవీస్‌ తర్వాత లేడీ ఓరియెంట్‌ చిత్రాలు ఆ రేంజ్‌ లో హిట్ కావడం `అరుంధతి` విషయంలోనే జరిగింది. 

25
పునర్జన్మ కథ `అరుంధతి`

'అరుంధతి' సినిమా తన ఊరిని, ఊరి ప్రజలను కాపాడటానికి... ప్రాణత్యాగం చేసి, తననే ఒక ఆయుధంగా మార్చుకున్న రాణి పునర్జన్మ కథ ఆధారంగా రూపొందింది. చాలా లోతైన కథాంశాన్ని అందరూ ఆస్వాదించేలా మాయ, మంత్రం, థ్రిల్, కుటుంబం, సెంటిమెంట్ అన్నీ కలగలిపి ఈ సినిమాని రూపొందించారు కోడి రామకృష్ణ. హర్రర్ థ్రిలర్‌గా వచ్చి బాక్సాఫీసుని షేక్‌ చేసింది. 

35
అనుష్కని కథానాయికగా మార్చిన సినిమా

అనుష్క అప్పటి వరకు స్టార్ హీరోల సరసన రొమాంటిక్ హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలో, ఆమెను కథానాయికగా మార్చిన సినిమా ఇదే. ఆ రోజుల్లో ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ సన్నివేశాల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు అనుష్కకు దక్కాయి. ఈ సినిమా కమర్షియల్‌గానూ మెప్పించింది. విమర్శకుల ప్రశంసలతో భారీ విజయం సాధించింది.

45
అరుంధతి హిందీ రీమేక్

ప్రస్తుతం 'అరుంధతి' సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నారని, రీమేక్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అనుష్క పోషించిన పాత్రలో 24 ఏళ్ల  యంగ్‌ సెన్సేషన్‌, హీరోయిన్‌ శ్రీలీల నటించనుంది. ఈ సమాచారం బయటకు వచ్చినా, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. తెలుగులో తక్కువ బడ్జెట్‌తో తీసి భారీ లాభాలు ఆర్జించిన ఈ సినిమాను బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తీయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

55
శ్రీలీల అరుంధతిలా అలరిస్తుందా?

ఇప్పటికే అరుంధతి సినిమా 2014లో బెంగాలీ భాషలో రీమేక్ అయి వాణిజ్యపరంగా, విమర్శకుల ప్రశంసలతో విజయం సాధించింది. తెలుగు, బెంగాలీ భాషల తర్వాత హిందీలో రీమేక్ అవుతున్న ఈ సినిమాకు హిందీలో కూడా మంచి ఆదరణ లభిస్తుందా? అనుష్కలాగే శ్రీలీల కూడా ఈ సినిమాతో కథానాయికగా తనదైన ముద్ర వేస్తుందా? అనేది వేచి చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories