కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఒక్కటైన సుమిత్ర, దశరథ- జ్యోత్స్నపై మండిపడ్డ శివన్నారాయణ

Published : Oct 30, 2025, 08:05 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 30వ తేదీ)లో ఒక్కటైన సుమిత్ర, దశరథ. దీప మీద కేసు ఫైల్ చేయమన్న జ్యోత్స్న. పావుగంటలో నీ పని చెప్తా జ్యోత్స్న అన్న కార్తీక్. ఆవేశంతో పోలీస్ స్టేషన్ కి వచ్చిన శివన్నారయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. 

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 గురువారం ఎపిసోడ్ లో తప్పు చేసిన మనిషిలా మీ అత్త ముందు తలదించుకొని నిలబడటం తప్ప.. నేను చేయగలిగింది ఏమి లేదని బాధపడుతుంటాడు దశరథ. అత్త కూడా నీలాగే ఆలోచిస్తుందేమో అంటూ సుమిత్రను చూస్తాడు కార్తీక్. నువ్వు ఇక్కడే ఉండు మామయ్య. నేను వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని చెప్పి సుమిత్ర వైపు వెళ్తాడు.

28
ఈ విషం తర్వాత తాగుతాను

సుమిత్ర, దశరథ కలిశారా లేదా? కలిస్తే కార్తీక్ మెసేజ్ పెట్టేవాడే అని ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో కాఫీ పట్టుకొని అక్కడికి వస్తుంది పారిజాతం. ఇదిగో కాఫీ తాగండి అంటుంది. కప్ తీసుకొని నువ్వు వెళ్లు అంటాడు శివన్నారాయణ. తాగి ఎలా ఉందో చెప్పండి అంటుంది పారు. తాగకుండానే చెప్పొచ్చు అంటాడు శివన్నారాయణ. అమృతంలా ఉంటుందని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అంటుంది పారు. దీనికి అమృతమని పేరు పెట్టకు.. అమృతం ఇంత చెండాలంగా ఉంటుందా అని అందరూ భయపడిపోతారు అంటాడు శివన్నారాయణ. నాకొక ఫోన్ రావాలి. అది రాకపోతే నాకు చిరాకు వస్తుంది. అప్పుడు ఈ విషాన్ని తాగుతాను అంటాడు శివన్నారాయణ.

సుమిత్ర ఎక్కడుందో మీకు తెలుసా అని అడుగుతుంది పారు. తెలుసు. ఎవ్వరికి తెలియని చోట ఉంది అంటాడు శివన్నారాయణ. తెలియదు అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా.. అంత వెటకారం ఎందుకో అంటుంది పారు. దశరథ ఎటు వెళ్లాడో మీకు తెలుసా అని అడుగుతుంది. తెలియదు అంటాడు. జ్యోత్స్న ఎటు వెళ్లిందని అడుగుతాడు. ఆఫీసుకు వెళ్లిందని చెప్తుంది పారు. ఎక్కడ ఏ మంట పెడుతుందోనని మనసులో అనుకుంటాడు శివన్నారాయణ.

38
సుమిత్రను రిక్వెస్ట్ చేసిన కార్తీక్

ఎక్కడికి అత్తా వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు కార్తీక్. మీ మామయ్యను ఇలా చూసి నేను ఇక్కడ ఉండలేను అంటుంది సుమిత్ర. ఆయనను అలా చూసి కూడా వెళ్లిపోతావా అత్త అంటాడు కార్తీక్. నేను ఎదురైతే నా భర్త నాముందు తలదించుకొని నిలబడతాడు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదురా అని బాధపడుతుంది సుమిత్ర. ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు నేను ఇవన్నీ ఆలోచించలేదు. తప్పు చేశాను. నా తప్పు ఇప్పుడు నాకు అర్థమవుతోంది అని అంటుంది సుమిత్ర. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ముందుకు కదులుతుంది.

48
ఒక్కటైన సుమిత్ర, దశరథ

సుమిత్ర అని పిలుస్తాడు దశరథ. వెనక్కి తిరిగి చూస్తుంది సుమిత్ర. నన్ను క్షమించమని అడుగుతాడు దశరథ. భర్త చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది సుమిత్ర. ఇప్పటికున్న దూరం సరిపోలేదా.. ఇంకా ఎంతదూరం వెళ్తావు అని అడుగుతాడు దశరథ. అత్త ఎక్కడికి పోదు మామయ్య.. ఆ దేవుడు తన సన్నిధిలోనే మీ ఇద్దరిని మళ్లీ కలిపాడు అంటాడు కార్తీక్. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. గుండెల్లో ఉన్న భారాన్ని దించేసుకోండి అంటాడు. అలాగే నా శ్రీమతిని పిలిస్తే.. ఇద్దరం కలిసి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామని చెప్తాడు కార్తీక్. దీప వచ్చిందా అని అడుగుతాడు దశరథ. 

అత్తను దీపే తీసుకొచ్చింది అంటాడు కార్తీక్. నన్నెవరు తీసుకురాలేదురా నేనే ఎవ్వరితో చెప్పకుండా వచ్చాను అంటుంది సుమిత్ర. అవునా అయితే దీప నాకు ఫోన్ చేసి ఉండాలే.  మీరు మాట్లాడుతూ ఉండండి. నేను దీపకు ఫోన్ చేసి వస్తాను అని వెళ్తాడు కార్తీక్.

58
కానిస్టేబుల్స్ తో కొట్టించండి

ఎస్సై గారు ఇది మా ఫ్యామిలీ విషయం. మేము ఇంటి దగ్గరే తేల్చుకుంటామని చెప్తుంది కాంచన. దీపను స్టేషన్ కి తీసుకొచ్చేసరికి ఇది ఫ్యామిలీ ఇష్యూ అయిందా అత్త అంటుంది జ్యోత్స్న. ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు జ్యోత్స్న. ఇక్కడితో ఆపు అంటుంది దీప. చూశారా ఎస్సై గారు మీ ముందే నాకు వార్నింగ్ ఇస్తోంది. మర్యాదగా కూర్చోబెట్టి అడిగితే నిజాలు చెప్పరు. దీప మీద కేసు ఫైల్ చేయండి. సెల్లో వేసి మీ లేడి కానిస్టేబుళ్లతో సౌండ్ బయటకు వినిపించేలా కొట్టించండి. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి అంటుంది జ్యోత్స్న. 

68
జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్

అయ్యో దీప చాలా సార్లు ఫోన్ చేసిందే.. అత్తకోసం ఎక్కడ వెతుకుతుందో అనుకొని తిరిగి ఫోన్ చేస్తాడు కార్తీక్. ఫోన్ ఎత్తుతుంది జ్యోత్స్న. దీప ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది. నువ్వు మా ఇంటికి వచ్చావా అని అడుగుతాడు కార్తీక్. లేదు దీపపై కిడ్నాప్ కేసు పెట్టాను పోలీస్ స్టేషన్ లో ఉంది. నేను కూడా వస్తా అని అత్త వచ్చింది అని పొగరుగా చెప్తుంది జ్యోత్స్న. నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను. పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. ఫోన్ నా భార్య చేతిలో ఉండాలి. నా భార్య నా ఇంట్లో ఉండాలని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నువ్వు 20 నిమిషాల తర్వాత ఫోన్ చేసినా నీ భార్య స్టేషన్ లోనే ఉంటుంది అని చెప్తుంది జ్యోత్స్న. నువ్వు అక్కడే ఉండు పావుగంటలో ఏం చేయాలో అదే చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. 

78
నువ్వు నన్ను చీట్ చేశావు కార్తీక్

నువ్వు కార్తీక్ ఇంట్లోనే ఉంటే వాడు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు దశరథ. నేనే చెప్పొద్దు అన్నాను అంటుంది సుమిత్ర. నేను ఓ మాట అన్నాను. అది నీకు నచ్చలేదు. అడగాలి. నిలదీయాలి. అదే ప్రేమంటే. ప్రేమలేని బంధం ఎంతోకాలం నిలబడదు. అయినా నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోతావు నువ్వు అని సుమిత్రను అడుగుతాడు దశరథ. జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉంది. జరిగినదంతా మర్చిపోదాం. మళ్లీ కొత్తగా జీవితాన్ని మొదలుపెడదాం అంటాడు దశరథ. శుభం అంటాడు కార్తీక్. మీరు ఇలా మనసు విప్పి మాట్లాడుకొని ఉంటే ఈ గొడవలే జరిగేవి కావు అంటాడు. అరేయ్ కార్తీక్ నువ్వు నన్ను చీట్ చేశావురా అంటాడు దశరథ. ఏం చేసినా మీ మంచి కోసమే మామయ్య అంటాడు కార్తీక్.

88
జ్యోత్స్నపై ఫైర్ అయిన శివన్నారాయణ

ఏంటి దీప పావుగంటలో ఏదో అద్భుతం చేస్తానంటూ బావ ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చాడు. టైం దగ్గరపడింది కానీ ఇంకా రాలేదు అంటుంది జ్యోత్స్న. ఏం జరగడానికైనా ఒక్క నిమిషం చాలు అంటుంది దీప. ఎవ్వరు తగ్గట్లేదు అంటుంది జ్యో. ఎస్సై గారు పావుగంట అయిపోయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటుంది జ్యో. ఆగండి అని పెద్దగా అరుస్తుంది పారు. పక్కనే ఉంటాడు శివన్నారాయణ. షాక్ అవుతుంది జ్యోత్స్న. 

నీకు ఎలా తెలిసిందో తెలియదు కానీ.. నీ ఎంట్రీ సూపర్ తాత అంటుంది జ్యోత్స్న. మమ్మీ గురించి ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మమ్మీని ఈ దీపే కిడ్నాప్ చేసింది. అందుకే అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ లో పెట్టాను అంటుంది జ్యో. సుమిత్రను దీప కిడ్నాప్ చేసిందని ఎవ్వరు చెప్పారు? నా కూతురు మీద, నా కూతురి కోడలు మీద ఎందుకు కేసు పెట్టావు? అని గట్టిగా అడుగుతాడు శివన్నారాయణ. నాన్నే అనుకున్నా.. నువ్వు కూడా వీళ్లకే సపోర్ట్ చేస్తున్నావా తాత అంటుంది జ్యోత్స్న.

మీరు ఎవ్వరిని స్టేషన్ కి తీసుకొచ్చారో తెలుసా? అని పోలీసులపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. శివన్నారాయణ కూతురిని స్టేషన్ కి తీసుకొస్తారా.. మీకెంత ధైర్యం అన్నట్లు మాట్లాడుతాడు. నేనేమి అత్తపై కేసు పెట్టలేదు. దీపపై పెట్టాను అంతే అంటుంది జ్యోత్స్న. నా కొడుకు లేని టైంలో నా కోడలిని తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటుంది కాంచనా. శభాష్.. శివన్నారాయణ కూతురివి అనిపించావు అని శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories