పవన్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ తో నటించి.. ప్రభాస్ ఒక్కడితో సినిమా చేయని హీరోయిన్ ఎవరు?

Published : Oct 30, 2025, 07:35 AM IST

టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఓ హీరోయిన్.. ప్రభాస్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకు ప్రభాస్ తో సినిమా చేయలేదు?

PREV
16
పాన్ ఇండియాను ఊపేస్తోన్న ప్రభాస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు స్టార్ హీరో. భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్లు వచ్చినా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. అప్పటికీ ఇప్పటికీ ఒకటే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా ఖాతాలో వేసుకుని.. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు.

26
ప్రభాస్ తో సినిమా అంటే పండగే..

ప్రభాస్ తో సినిమా అంటే డైరెక్టర్లు, హీరోయిన్లు, కో ఆర్టిస్ట్ లకు పండగే. స్టార్ హీరో అన్న గర్వం ఏమాత్రం లేకుండా అందరితో సరదాగా ఉంటారు ప్రభాస్. షూటింగ్ జరిగినన్ని రోజులు ఇంటి భోజనం రుచిచూపిస్తుంటాడు. ఇక హీరోయిన్లు అయితే ఆయన తో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోయిన్లు అందరు ప్రభాస్ సరసన నటించారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో సినిమా చేయలేదు. ఆమె మరెవరో కాదు సమంత. అవును సమంత ఇంత వరకూ ప్రభాస్ తో ఒక్క సినిమాలో కూడా జోడీగా నటించలేకపోయింది.

36
ప్రభాస్, సమంత కాంబోలో సినిమా ఎందుకు రాలేదు?

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో సమంత సినిమా చేసింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, నానీ,నాగచైతన్య ఇలా టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది సమంత. కానీ ప్రభాస్ తో మాత్ర ఒక్క సినిమాలో కూడా ఆమె నటించలేదు. దానికి ప్రత్యేకంగా కారణాలు అంటూ ఏమీ లేవు కానీ.. వీరిద్దరి మధ్య హైట్ ఒక్కటే ప్రాబ్లమ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి హైట్ లో చాలా తేడా ఉండటంతో.. ఈ కాంబోమీద డైరెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదట. అందుకే సమంత, ప్రభాస్ కాంబోలో సినిమా రాలేదని అంటుంటారు.

46
ప్రభాస్ ఏమన్నాడంటే..?

ఈమధ్య ప్రభాస్ కూడా ఈ విషయంలో స్పందించాడు. సమంత కాంబోలో తన సినిమా రాకపోవడానికి హైట్ కారణం అన్నట్టుగా మాట్లాడారు. తనకు సమంతకు మధ్య దాదాపు 10 అంగుళాల హైట్ తేడా ఉందని.. అందుకే ఇద్దరిని కెమెరా ఫ్రేమ్ లో సెట్ చేయడం ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు. ప్రభాస్ హైట్ 6 అడుగులకు పైనే ఉంటుంది, సమంత హైట్ 5 అడుగుల వరకూ ఉంటుంది. దాంతో వీరిద్దరి మధ్య హైట్ తేడా స్క్రీన్ పై స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ సమంత ఇదే హైట్ ఉన్న మహేష్ బాబుతో మాత్రం సినిమాలు చేసింది.

56
ప్రభాస్ సినిమాలు

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తోన్న రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హనూరాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలు కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇవి కాకుండా సలార్ 2, కల్కీ2 సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లాల్సిఉంది. ఈసినిమాలతో పాటు మరికొన్నికథలు హోల్డ్ లోపెట్టారట ప్రభాస్. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయ్యేవరకూ ఐదారుఏళ్లకుపైనే సమయం పట్టే అవకాశం ఉంది.

66
నిర్మాతగా సమంత బిజీ బిజీ..

అటు సమంత నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంది. నటిస్తూనే.. తన సినిమాలు తానే నిర్మించుకుంటుంది. శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా హిట్ కొట్టిన సామ్.. రీసెంట్ గా మా ఇంటి బంగారం అనే సినిమాను స్టార్ట్ చేసింది. ఈసినిమాకు సబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. ఆ ఫోటోలు కూడా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఇవి కాకుండా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో లవ్ రూమర్స్ తో హాట్ టాపిక్ అయ్యింది స్టార్ హీరోయిన్. ఈమధ్యే దీపావళి సెలబ్రేషన్స్ కూడా రాజ్ ఫ్యామిలీతో కలిసి చేసుకుంది సమంత.

Read more Photos on
click me!

Recommended Stories