21 రోజుల లాక్‌డౌన్, రాత్రి నుంచి అమలు, కొత్త అప్‌డేట్ వైరల్

Published : Nov 28, 2025, 12:59 PM IST

 Lockdown Movie Trailer : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు లాక్‌డౌన్ ట్రైలర్ అప్‌డేట్ వచ్చింది. ఇంతకీ మళ్లీ ఈ లాక్ డౌన్ రచ్చ ఏంటి? 

PREV
15
కరోనా ప్రభావం వల్ల లాక్‌డౌన్‌..

 కరోనా వ్యాప్తి ప్రభావం వల్ల  దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ప్రపంచంతో పాటు మన దేశాన్ని కుదిపేసిన ఘటన కరోనా వ్యాప్తి. ఇందులో ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోయారు. చాలామంది రోజువారీ జీవనోపాధి దెబ్బతింది. అన్ని పరిశ్రమలపై కరోనా ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అయిపోయింది. 

25
మళ్లీ 21 రోజులు లాక్‌డౌన్‌

మరోసారి  లాక్‌డౌన్‌ ను జనాలు చూడబోతున్నారు.  మళ్లీ 21 రోజులు లాక్‌డౌన్‌ అమలు కాబోతోంది. అయితే అది నిజం జీవితంలో కాదు.. అది సినిమాలో మాత్రమే. డిసెంబర్ 5న 'లాక్‌డౌన్' సినిమా విడుదల కానుంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఇందులో చార్లీ, నిరోషా, లివింగ్‌స్టన్, ప్రియా వెంకట్ వంటి ప్రముఖులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

35
లాక్‌డౌన్‌ రోజులు ఆధారంగా సినిమా

లాక్‌డౌన్‌  సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకురాత్రి నుంచి 21 రోజుల లాక్‌డౌన్ విధిస్తారు. దాంతో చాలామంది బ్రతకడం కష్టమై పోతుంది. ఎవరికి వారు తెలిసినవారికి  ఫోన్ చేసి డబ్బులు అడిగే పరిస్థితి వస్తుంది.

45
లాక్‌డౌన్‌ రిలీజ్ డేట్

లాక్‌డౌన్‌లో నిజంగా ఏం జరిగిందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈసినిమా రిలీజ్ అయిన తరువాతి రోజు బాలకృష్ణ అఖండ 2 రాబోతోంద. ఈ సినిమా రిలీజ్ రోజే..  కార్తీ నటించిన 'వా వాతియారే' కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

55
అనుపమా పరమేశ్వరన్ సరికొత్త పాత్రలో

ఈసినిమాలో ప్రధాన పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించింది. ఆమె  అనిత పాత్రలో కనిపించబోతోంది. ఎప్పుడు బయటతిరేగే అమ్మాయిగా అనుపమ నటిస్తోంది. ఆమె తరచుగా బయటకు వెళ్తుంటుంది… ఎవరు ఏమడిగినా కోప్పడుతుంది. ఎప్పుడూ ఫోనే చూస్తుంటుంది… కానీ కరోనా టైమ్ లో ఆమె చేసిన పని.. సినిమా కథనే మలుపు తిప్పుతుంది. మరి ఈమూవీ ఎలా ఉంటుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories