Dharmendra Unseen Photos: ధర్మేంద్ర అన్‌సీన్ ఫోటోలు షేర్ చేసిన హేమ మాలిని

Published : Nov 28, 2025, 12:21 PM IST

Dharmendra Unseen Photos: బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ధర్మేంద్ర మరణించి మూడు రోజులు అయింది. అతని రెండో భార్య హేమమాలిని భర్తను తలచుకుని ఎంతో ఎమోషన్ అయ్యారు. అతనితో కలిసి ఉన్న అన్ సీన్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది హేమమాలిని.

PREV
17
ధర్మేంద్ర ఫోటోలు

హేమ మాలిని తన  X ఖాతాలో భర్త ధర్మేంద్రతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.  వీటిని తన జీవితంలోని మర్చిపోలేని క్షణాలుగా  ఆమె రాసుకొచ్చారు. ఆమె సోషల్ మీడియాలో ‘ధరమ్ జీ!  నాకు ఎంతో ఆప్తులు. ప్రియమైన భర్త, మా ఇద్దరు కుమార్తెలు ఈషా, అహానాలకు ప్రియమైన తండ్రి, స్నేహితుడు, తత్వవేత్త, గైడ్, కవి, అవసరమైన ప్రతిసారీ నాకు ఆయన ఉన్నారు.   నిజానికి, ఆయన నాకు సర్వస్వం!” అని రాసింది.

27
చూడ చక్కని జంట

హేమ మాలిని అప్పట్లో డ్రీమ్ గర్ల్. ఇక ధర్మేంద్ర హ్యాండ్సమ్ హీరో. వీరిద్దరి జంట ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి మాటలే రావు. వీరిద్దరి మధ్య వయసు తేడా  13 ఏళ్లు.

37
ఇద్దరు కూతుళ్లతో ధర్మేంద్ర

హేమ మాలిని ఇంకా ఇలా రాసుకొచ్చారు…మంచి, చెడు సమయాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నారు. ఆయన తన స్నేహపూర్వక స్వభావంతో నా కుటుంబ సభ్యులందరినీ తనవాళ్లుగా చేసుకున్నారు, ఎప్పుడూ అందరిపై ప్రేమ చూపించారు… అంటూ ధర్మేంద్రను తలచుకున్నారు. తన కూతుళ్లు అహనా, ఈషా అంటే ధర్మేంద్రకు ఎంతో ప్రాణం.

47
ప్రేమ కథ

హేమ మాలిని, ధర్మేంద్ర లవ్ స్టోరీ ఈనాటిది కాదు 1970లోనే మొదలైంది. వీరిద్దరూ ఓ సినిమా షూటింగ్లో కలిశారు. కాన అప్పటికే ధర్మేంద్రకు పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా హేమ మాలినిని ప్రేమించారు ధర్మేంద్ర. వీరిద్దరూ ప్రేమలో పడి 1980లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది.

57
ఒకే ఇంట్లో కలిసుండలేదు

పెళ్లి తరువాత ధర్మేంద్ర - హేమ మాలిని మాత్రం కలిసి ఒకే ఇంట్లో ఉండలేదు. తన పెళ్లి వల్ల మొదటి భార్యకు అన్యాయం జరగకూడదని అనుకుంది హేమమాలిని. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు తన భర్త మీద ఎప్పుడూ నిఘా పెట్టలేదు హేమ. తండ్రిగా, భర్తగా అతనికి బాధ్యతలు తెలుసని ఎప్పుడూ ధర్మేంద్రను సపోర్టు చేస్తూనే ఉంది.

67
మొదటి భార్యకు న్యాయంగా

ధర్మేంద్ర ఎక్కువ సమయం మొదటి భార్యా పిల్లల దగ్గరే ఉండేవారు. అయినా హేమమాలిని ఒంటరిగానే తన ఇద్దరు కూతుళ్లను పెంచుకుంది. కానీ తనకు అవసరమైనప్పుడు వెంటనే ధర్మేంద్ర వచ్చేవారని, ఏనాడు కష్టంలో తనని ఒంటరిగా వదిలేయలేదని ఆమె అన్నారు. ఆమె మొదటి భార్య కొడుకులు అయిన సన్నీ డియోల్, బాబీ డియోల్ తో కూడా ప్రేమగా ఉండేది.

77
ధర్మేంద్ర హ్యాండ్సమ్ హీరో

ధర్మేంద్ర ఎంతో హ్యాండ్సమ్ హీరో. ఎంతో మంది అమ్మాయిలు అప్పట్లో ఇలాంటి భర్త రావాలని కోరుకునేవారు. అందుకే హేమ కూడా అతనికి పడిపోయిందేమో.  24 నవంబర్ 2025న 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర మరణించారు.

Read more Photos on
click me!

Recommended Stories