క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.