ఆర్య గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఆమెకు ఏమవుతావు అంటాడు జడ్జి. నేను అతని భార్యని, ఐ యాం అను. వైఫ్ ఆఫ్ ఆర్య వర్ధన్ అంటుంది అను. ఒక్కసారిగా అంజలి, మదన్ షాకవుతారు. ఏంటా సాక్ష్యం అంటాడు పిపి. పోలీస్ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ ని సాక్షిగా తీసుకువస్తుంది అను. ఆమెను చూసి ఎస్ఐకి చెమటలు పడతాయి. అను ఆటోలో వెళ్ళింది పోలీస్ స్టేషన్ కని, అక్కడ కానిస్టేబుల్ ని బ్రతిమిలాడి సాక్ష్యం చెప్పడానికి ఒప్పించి తీసుకొస్తుందని అప్పుడు మనకి తెలుస్తుంది.