నేను ఎక్కడికీ వెళ్ళలేదు ఐ యాం బ్యాక్ అని అంటాడు. పక్కనే ఉన్న జెండే తో ఒక వీడియో రికార్డ్ చేయమని చెప్తాడు. అప్పుడు జెండే రికార్డ్ చేయడం మొదలుపెడతాడు. ఆర్య మాట్లాడుతూ కొంత మంది మా మీద బురద జల్లే ప్రయత్నంలో తప్పుదారులు పడుతున్నారు. మా కంపెనీని, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మాట ఇస్తున్నాను. మీ డబ్బులు ఎక్కడికి పోవు, పైసా కూడా నష్టం రాకుండా తిరిగి మీకు అప్పజెప్తాను.