ఇక సోషల్ మీడియా వార్తలకు బలం చేకూర్చుతున్నట్టుగా.. ఇద్దరు కలిసి బయట ఎక్కువగా కనిపిస్తున్నారు తమన్నా , విజయ్ వర్మ. న్యూ ఇయర్ రోజు ముద్దు పెట్టుకుంటూ దొరికిపోయిన ఈజంట.. ఆతరువాత కూడా బయట చాలాసార్లు కనిపించారు. ఇక తాజాగా డిన్నర్ డేట్ లో కూడా కనిపించి షాక్ ఇచ్చారు కపుల్స్. విజయ్ వర్మతో డేటింగ్ వార్తలను తమన్నా ఖండించారు. వినడానికి చాలా సిల్లీగా ఉందంటూ సింపుల్ గా కొట్టిపారేశారు. నేను ఎవరితో రిలేషన్ లో లేను. పెళ్లి కుదిరినప్పుడు నేనే స్వయంగా చెబుతానంటూ స్పష్టత ఇచ్చింది. కాని విజయ్ వర్మతో కలిసి తిరుగుతూనే ఉంది బ్యూటీ.