మద్రాస్ స్టూడియోలో అక్కినేనికి అవమానం, హైదరాబాద్ కు షిప్ట్ అయిన వెంటనే ఏం చేశారంటే?

Published : Jul 11, 2025, 12:37 PM IST

మద్రాస్ లో ఉండగా అక్కినేని నాగేశ్వరావు కు అవమానం జరిగిందా? అందుకే ఆయన హైదరాబాద్ షిప్ట్ అయ్యారా? హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారు? ఏఎన్నార్ స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే? 

PREV
15

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు ఎన్టీఆర్ ఏఎన్నార్. ఈ ఇద్దరు హీరోలు తమ మార్క్ నటనతో తెలుగువారి మరసులో చోటు సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ ను తెలుగువారు తమ ఆరాధ్య ధైవంగా భావిస్తుంటారు. కాని ఎన్టీఆర్ కంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చి అక్కినేని. అంతే కాదు తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి నడుస్తుండగా.. అక్కడి నుంచి హైదరాబాద్ కు మొదటగా షిప్ట్ అయ్యింది కూడా అక్కినేని నాగేశ్వరావే.

25

తెలుగు,తమిళ ప్రజలు కలిసి మద్రాస్ రాష్ట్రంగా కలిసి ఉన్న టైమ్ లో మద్రాస్ నగరంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. అక్కడి నుంచే తెలుగు,తమిళ, కన్నడ పరిశ్రమలు నడిచేవి. కాని తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తరువాత కొంత కాలానికి, తెలుగువారు అంతా తెలుగురాష్ట్రంలోనే ఉండాలి అని అనుకున్న కొంత మంది సినిమావారు తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తరలించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా అందరికంటే ముందుగా ముందడుగు వేసింది అక్కినేని నాగేశ్వరావు. 1962 లోనే ఆయన మద్రాస్ నుంచి హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు. 1975 లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో 22 ఏకరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించారు నాగేశ్వారావు.

35

అయితే అన్నపూర్ణ స్టూడియో కట్టడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నాగేశ్వరావు. గతంలో నటి జయప్రద హోస్ట్ గా జయప్రదం కార్యక్రమంలో జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ అందరిని జయప్రద ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేశారు. ఈక్రమంలో అక్కినేని కూడా జయప్రదం కార్యక్రమానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న వేశారు జయప్రద. అన్నపూర్ణ స్టూడియోస్ ను చాలా ఇష్టంగా కట్టుకున్నారు. దాని వెనుక ఏదైకా ప్రత్యేకమైన నేపథ్యం ఉందా అని అడిగారు.

45

అందుకు నాగేశ్వరావు సమాధానం చెపుతూ.. '' మద్రాస్ లో కొన్ని స్టూడియోస్ లో నాకు ప్రవేశం లేకుండా చేశారు. అది ఎందుకు చేశారు. ఏంటీ అనే వివాదం ఇప్పుడు అనవసరం కాని.. నాకు స్టూడియోల్లోకి వెళ్లే అవకాశం లేనప్పుడు నాకు అక్కడ ఉండాలని పించలేదు. అందుకే వెంటనే హైదరాబాద్ వచ్చేశాను. నా స్టూడియోలో అయితే నన్ను ఎవరు బాన్ చేయలేరు కదా.. అందుకే నా భార్య నాకు ఇచ్చిన సలహా, సపోర్ట్ ప్రకారం హైదరాబాద్ లో స్టూడియో కట్టడం జరిగింది ''.

55

అలా మాద్రాస్ లో అక్కినేనికి జరిగిన అవమానం కారణంగానే ఆయన హైదరాబాద్ రావడం, ఇక్కడ స్టూడియోను నిర్మించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు అవుతోంది. 1975 లో నిర్మాణం స్టార్ట్ చేసి 1976 లో స్టూడియోను ఓపెనింగ్ చేశారు. ఇలా అక్కినేను మద్రాస్ నుంచిహైదరాబాద్ కు షిఫ్ట్ అయిన మొదటి నటుడు అయ్యారు. 

అంతే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి అక్కినేని ప్రధాన కారకుడు అయ్యారు. ఆయనతరువాత చిన్నగా కొంత మంది నిర్మాతలు ఇక్కడికి చేరారు. వెంటనే ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా హైదరాబాద్ వచ్చేశారు. కాని శోభన్ బాబు, అంజలీదేవి, ఎస్పీ బాలు, డబ్బింగ్ జానకీ లాంటి కొంత మంది స్టార్స్ మాత్రం ఇప్పటికీ చెన్నైలోనే ఉన్నారు. అక్కడే ఫ్యామిలీస్ తో పాటు స్థిరపడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories