ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి నేను రెండు మూడు సినిమాలు చేశాము. చిరంజీవితో నా ఫస్ట్ మూవీ ఇది కథ కాదు. తమిళంలో రజినీకాంత్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేశారు. ఈ సినిమాలో ఆయన నేను భార్య భర్తలుగా నటించాము.
ఈసినిమా తరువాత ప్రాణం ఖరీదు సినిమా తో పాటు మరో రెండు మూడు సినిమాల్లో నటించాము. రిక్షవోడు సినిమాలో కూడా చిరంజీవితో కలిసి నటించాను. కాని అన్ని సినిమాల్లో పెయిర్ గా నటించలేదు. షూటింగ్ లో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. తన పని తాను చేసుకునేవారు. అందరికంటే చాలా డిఫరెంట్ గా ఉండేవారు.
ఆయన నటన చూసి ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతాడు అని అనుకేనేదాన్ని, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు గారు ఇలా ఒక చైన్ కొనసాగుతుంది. అందులో చిరంజీవి కూడా చేరతారు అని నమ్మకం ఉండేది. స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నాను కాని ఇంత పెద్ద మెగాస్టార్ అవుతారని మాత్రం అనుకోలేదు అని జయసుధ అన్నారు.