పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన భర్త అనుభవించిన బాధ, గెలిచిన క్షణం తనకు ఏమనిపించిందో వివరించే ప్రయత్నం చేశారు.
డిప్యూటీ సీఎం గా రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. అంతకు ముందు రాజకీయంగా ఎన్నో అవమానాలు అనుభవించాడు పవన్. తనతో పాటు తన ఫ్యామిలీపై కూడా విమర్శలు చేయడం, మూడు పెళ్లిళ్లంటూ విమర్శించడం, ఎన్నో రకాలుగా ఇబ్బందులను దాటుకుని డిప్యూటీ సీఎం వరకూ ఎదిగాడు పవన్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఎమోషనల్ పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పెట్టారు ఆయన భార్య అన్నా లెజినోవా. ఆమె ఏమన్నారంటే?
23
ఎన్నో అవమానాలు దాటుకుని..
ఆ అలసట... ఆ అవమానం... ఆ అనిశ్చితి... ప్రపంచమంతా తనకి వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఆ పగళ్ళు, రాత్రులు. అతన్ని అవమానించారు...ఎగతాళి చేశారు... ప్రశ్నించారు.. అతన్ని రకరకాల పేర్లతో పిలిచారు. అతను బయట యుద్ధాలు చేస్తుండగా, నేను ఇంట్లో మా పిల్లల కోసం ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తూ.. ఒంటరితనాన్ని అనుభావించేదాన్ని. నేను కూడా కుంగిపోయిన రోజులు ఉన్నాయి. భయపడిన రోజులు ఉన్నాయి. తాను నమ్మిన దాని కోసం ఒక వ్యక్తి ఇంకెంత భరించగలడని ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. కానీ మేము అవన్నీ లెక్క చేయకుండా ముందుకు సాగాము. మాదారి అంత సులభంగా లేదు... సంతోషంగా లేదు'' అని అన్నా అన్నారు.
33
ఆక్షణంలో కన్నీళ్లు ఆగలేదు..
పవన్ కళ్యాణ్ గెలిచి..డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్షణాలను అన్నా గుర్తు చేసుకున్నారు. పవన్ గురించి మాట్లాడుతూ.. '' రాజకీయంగా కాదు. మానవతా దృక్పథంతో.. అతను చేసిన సేవ, సంవత్సరాల బాధ ఒకే ఒక్క క్షణంగా మారిపోయింది.కళ్ళలో నీళ్ళతో అక్కడ నిలబడిన ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది… నేను ఏడుస్తుండటాన్ని మోదీజీ కూడా గమనించారు అవి ఆనందపు, స్వచ్ఛమైన సంతోషపు కన్నీళ్లు. ఎందుకంటే, కొన్నిసార్లు దేవుడు మనుషులను సంవత్సరాల తరబడి గాయపడటానికి, అవమానాలకు, పరీక్షలకు గురిచేస్తాడు... కేవలం ప్రపంచం మొత్తం ముందు వారి గౌరవాన్ని తిరిగి ఇవ్వడానికే దేవుడు అలా చేస్తాడు. పవన్ ప్రమాణం చేసిన ఆ క్షణంలో నాకేమనిపించిందని నన్ను అడిగితే? కేవలం గర్వం.. వదులుకోడానికి నిరాకరించిన ఆ వ్యక్తి పట్ల గర్వం '' అని ఆమె అన్నారు.