చిరంజీవి నటించిన ఒక ఫ్లాప్ మూవీ విషయంలో తెరవెనుక ఆసక్తికర కథ ఉంది. అది రీమేక్ చిత్రం. చిరంజీవి ఎంతో ఇష్టపడి చేసినప్పటికీ డిజాస్టర్ తప్పలేదు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో దర్శకులతో సినిమాలు చేశారు. వారిలో తమిళ దర్శకులు కూడా ఉన్నారు. చిరంజీవి తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు భారతీరాజా, కె బాలచందర్ లాంటి తమిళ దర్శకులతో సినిమాలు చేశారు. అయితే చిరంజీవి తమిళ దర్శకులతో వర్క్ చేసినప్పుడు కొన్ని హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి.
25
భారతీరాజా దర్శకత్వంలో సత్యరాజ్
ఇటీవల మరణించిన లెజెండ్రీ డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వంలో చిరంజీవి ఆరాధన అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం వెనుక ఆసక్తికర కథ ఉంది. 1986లో భారతీరాజా కడలోరు కవితైగల్ అనే చిత్రం రూపొందించారు. ఈ మూవీలో హీరోగా కట్టప్ప సత్యరాజ్, హీరోయిన్ గా రేఖ హారిస్ నటించారు. ఇళయరాజా సంగీత తమిళ ప్రేక్షకులని ఊపు ఊపేసింది.
35
ఆ చిత్రానికి చిరంజీవి ఫిదా
భారతీరాజా టేకింగ్ తో సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఒక రౌడీకి, స్కూల్ టీచర్ కి మధ్య జరిగే ప్రేమ కథని భారతీరాజా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీని చిరంజీవి చూశారు. మెగాస్టార్ కి విపరీతంగా నచ్చేసింది. దీనితో చిరు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అల్లు అరవింద్ భారతీరాజాతో సంప్రదింపులు జరిపి ఒప్పించారు. ఆ విధంగా ఆరాధన చిత్రం తెరకెక్కింది.
దొంగమొగుడు, రాక్షసుడు లాంటి మాస్ చిత్రాలతో చిరంజీవి ఇమేజ్ పెరిగిపోయింది. తమిళ వెర్షన్ కి ఎలాంటి మార్పులు చేయకుండా తెరకెక్కించడం, చిరంజీవి ఇమేజ్ ని మ్యాచ్ చేయలేకపోవడంతో ఆరాధన చిత్రం డిజాస్టర్ అయింది.
55
సందీప్ రెడ్డి ఆఫీస్ లో చిరు
మొత్తంగా కట్టప్పకి తిరుగులేని హిట్ గా నిలిచిన చిత్రంతో చిరంజీవి దెబ్బైపోయారు. ఆరాధన చిత్రంలో హీరోయిన్ గా సుహాసిని నటించారు. అయితే ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ చిరంజీవికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ మూవీలో ఓ స్టిల్ అంటే చాలా మందికి ఇష్టం. ఈ చిత్రంలో చిరంజీవి పులిరాజు అనే పాత్రలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి కోపంగా చూస్తున్న స్టీల్ నే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన ఆఫీస్ లో పెట్టుకున్నారు.