తులసి ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ వద్దనుకుంటే ఎలాగా. ఒక్కడి వల్ల అక్కడంతా పెద్ద పెంట అయిపోయింది అని అంటూ ఉండగా తులసి అక్కడికి వస్తుంది.ఏం చేద్దాం అనుకుంటున్నాను తులసి అని అనసూయ తులసిని అడుగుతుంది. అప్పుడు తులసి,తెలీదు అత్తయ్య,నేను సామ్రాట్ గారి నుండి ఇప్పుడు దోషి లాగా నిలబడిపోయాను, ఆయన నన్ను చూసిన చూపు చాలా అవమానంగా ఉంది అని అంటుంది. ఆ మాటలకు అనసూయ, నువ్వేం తప్పు చేయలేదు నిన్ను చెప్పొద్దని నందు చెప్పాడు కదా ఆ విషయం వెళ్లి సామ్రాట్ కి చెప్పు అని అంటుంది. అప్పుడు తులసి నేను చెప్తే బాగోదు, దోషి మాట కు విలువ ఉండదు.అది ఆయనే వెళ్లి సామ్రాట్ గారికి నిజం చెప్పాలి. అప్పటివరకు నాకు మ్యూజిక్ స్కూల్ అవ్వదేమో అని అంటుంది.