హరిహర వీరమల్లు సినిమాని భయపెడుతున్న 'మెగా - గుంటూరు' సెంటిమెంట్ , ఫ్యాన్స్ లో ఆందోళన..!

First Published | Sep 2, 2022, 9:13 AM IST


ఈ తరంలో ఎదురులేని స్టార్ గా పవన్ కళ్యాణ్ ఎదుగుదల చాలా ప్రేరణ కలిగించేదే, ఆయన ఇద్దరు సోదరులూ నటులు కావడం..వారిలో  చిరంజివి మెగా స్టార్ కావడం...దీనికి తోడు రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ లతో పాటు త్వరలో పవన్ కళ్యాన్ తనయుడు అకీరా నందన్ కూడా తెరంగేట్రానికి సిద్ధమౌతున్నాడు. 


సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవు . సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయి? సినీ పరిశ్రమ జోలికి వస్తే మనమంతా కలవాలి. నేను ఎవరి కులం చూడను.. వ్యక్తిత్వానికే విలువ ఇస్తా . సినిమావాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదు.. కష్టపడుతున్నారు. మాలో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి.. అది శత్రుత్వం కాదు  అన్నారు పవన్ కళ్యాణ్...రిపబ్లిక్ సినిమా పంక్షన్ లో.  అప్పట్లో అదో హాట్ టాపిక్. కానీ ఇప్పుడు మరోసారి కులాల ప్రస్దావన సోషల్ మీడియా పుణ్యమా అని సినీ పరిశ్రమలో మొదలైంది.

Pawan Kalyan Chiranjeevi

మొన్నటికి మొన్న నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమా దర్శకుడు ..గతంలో ఓ సామాజిక వర్గం పై కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ కామెంట్స్ నేను చేయలేదు అని సైబర్ క్రైమ్ లో కేసు పెట్టినా అప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. మమ్మల్ని , మా కులాన్ని అంటావా ఆ డైరక్టర్ తీసిన సినిమా చూడం అని కొందరు ఆ సినిమాని బాయ్ కాట్ చేసారు. ఫలితం తెలిసిందే.


Pawan Kalyan Chiranjeevi


ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటి సినిమా పరిస్దితి కొంచెం అటూ ఇటూగా అదే జరిగింది. ఆ దర్శకుడుపై ఓ రేంజిలో నెగిటివ్ గా విమర్శలు వచ్చాయి. అతను తన సామాజిక వర్గానికి జై కొడుతూ వేరే పార్టీ కు సంభందించిన వారిని సోషల్ మీడియాలో తిట్టి పోసాడు. అదీ జరిగింది గతంలోనే అదీ సినిమాకు చుట్టుకుంది.
 


ఇలా ఈ మధ్యకాలంలో సినిమాకు, కులానికి విడతీయలేని సంభందం పూర్తి స్దాయిలో ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు టాపిక్ వేరు. మెగా కాంపౌండ్ చేస్తున్న దర్శకులు గుంటూరు కు చెందిన ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారైతే ఆ సినిమాలు వర్కవుట్ కావటం లేదని సోషల్ మీడియాలో కొందరు రచ్చ మొదలెట్టారు. 
 

Hari Hara Veera Mallu


అందుకు ఉదాహరణగా .... రామ్ చరణ్ తో ...గుంటూరు పెద కాకానికి చెందిన బోయపాటి శ్రీను డైరక్ట్ చేసిన సినిమా డిజాస్టర్ ని ఉదాహరణగా చూపెడుతున్నారు. ఆ సినిమా ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందో వివరిస్తున్నారు. అదే డైరక్టర్ వేరే హీరోలతో చేసిన హిట్స్ ని ఇదే సమయంలో బయిటకు తీస్తున్నారు. ఆ సినిమా ఫెయిల్ అవటానికి కాంబినేషన్ కారణం కాదని, కథ అని  మాత్రం అనటం లేదు.

Hari Hara Veera Mallu


ఇక రీసెంట్ గా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య చిత్రం కూడా బయిటకు లాగుతున్నారు. అదెంత డిజాస్టర్ అనేది చెప్తున్నారు. కొరటాల శివ కూడా గుంటూరు పెద కాకాని జన్మస్దలం  అని గుర్తు చేస్తున్నారు. ఆ సినిమా ఫెయిల్ అవటానికి ఇదే సెంటిమెంట్ గా వివరిస్తున్నారు.


ఇప్పుడు దర్శకుడు క్రిష్ కూడా గుంటూరు చెందిన జిల్లా వాడే అని గుర్తు చేస్తున్నారు. క్రిష్ గతంలో వరుణ్ తేజతో చేసిన కంచె సినిమా అవార్డ్ లు తెచ్చి పెట్టి ఉండవచ్చేమో కానీ కమర్షియల్ గా హిట్ కాదని చెప్తున్నారు.  వాస్తవానికి ఆ సినిమా లాస్ అయితే కాదు

Hari Hara Veera Mallu


వీటిన్నటినీ గుర్తు చేస్తూ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాపై బురద జల్లే పోగ్రాం పెట్టుకున్నారు . ఇది చాలా దారణం అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయినా ఈ ప్రచారం ఆగటం లేదు. ఈ సినిమా ఇప్పటికే లేటు అవుతూ వస్తోందని, స్క్రిప్టు సరిగ్గా రాలేదని, పవన్ కు ఈ సినిమా కలిసి రాదని నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే వారందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం..ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, రాఘవేంద్రరావు వంటి వారు మెగా కుటుంబంతో పెద్ద హిట్స్ ఇచ్చారు. అప్పట్లో ఇవివి సత్యనారాయణ గారు కూడా పెద్ద హిట్ ఇచ్చారు చిరంజీవికు. ఇదే సామాజిక వర్గానికి చెందిన అశ్వనీదత్ సైతం మెగా కుటుంబంతో మంచి అనుబధం ఉంది. పెద్ద హిట్స్ ఇచ్చారు. 


వాస్తవానికి ప్రతిభకి, కులానికి సంబంధం లేదు. దాన్ని ప్రక్కన పెట్టి  కేవలం కులాల పాయింటాఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నారు. సరిగ్గా గమనిస్తే ...ఆ  సామాజిక వర్గంలోని నిర్మాతల, హీరోల, స్టూడియో అధినేతల సమిష్టి కృషే ఈ రోజున తెలుగు పరిశ్రమ ఈ స్దాయిలో వర్దిల్లడానికి కారణం. తెలుగు సినీ రంగం హిందీరంగానికి పోటీ ఇవ్వగలిగే స్థాయిలో సినీవ్యాపరం చేయటానికి కారణం. ఆ విషయ మర్చిపోయి కామెంట్స్ చేయటం దారుణం. 
 

సినిమా విషయానికి వస్తే... 17వ శతాబ్దం నాటి మొఘల్స్ కుతుబ్‌ షాహిల కాలం నాటి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతున్న నేపథ్యంలో ఆనాటి వస్త్రాధారణకు ప్రయారిటీ ఇచ్చామని, సహజత్వం పండేలా కేర్‌ తీసుకుంటామని, అందుకోసం   ఇండియాలోని పలు ప్రాంతాలను సందర్శించినట్టు చెప్పింది. ఇందులో పవన్‌ కుతుబ్‌ షాహి చట్టాలను వ్యతిరేకించి, పోరాడే యోధుడిగా కనిపిస్తాడని చెప్పారు.

Latest Videos

click me!