Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

Published : Oct 17, 2026, 01:30 PM IST

Anirudh Ravichander Net Worth: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో అనిరుధ్ ఆస్తుల విలువ.. రెమ్యునరేషన్, మ్యూజిక్ జర్నీపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

PREV
13
అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంతంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి వార్తలతో ఆయన సంపాదన, ఆస్తుల వివరాలపై అందరిలో ఆసక్తి పెరిగింది.

ఫిల్మీబీట్ సమాచారంతో పింక్‌విల్లా ప్రచురించిన కథనం ప్రకారం.. అనిరుధ్ ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ లెక్కలపై ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఒక్కో సినిమాకు సంగీతం అందించేందుకు అనిరుధ్ రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్, లైవ్ షోలు, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఆయన భారీగా సంపాదిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్స్ ఇస్తూ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయన టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు.

23
'కొలవెరి డి' నుంచి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ వరకు...

ధనుష్, శృతి హాసన్ జంటగా 2012లో వచ్చిన '3' సినిమాతో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కత్తి, వేలైల్లా పట్టధారి, జైలర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గరయ్యారు.

రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, విజయ్, షారుఖ్ ఖాన్ లాంటి అగ్ర హీరోల సినిమాలకు అనిరుధ్ పనిచేశారు. మాస్ బీట్స్‌తో పాటు ట్రెండీ మ్యూజిక్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి.వరుస ప్రాజెక్టులు, లైవ్ షోలతో బిజీగా ఉన్న అనిరుధ్ సంపాదన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

33
పెళ్లి వార్తల్లో నిజమెంత?

సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కూతురు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. 2026 నవంబర్ 11న గ్రీస్ దేశంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కావ్య మారన్ తల్లిదండ్రులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, తమ పెళ్లిపై అనిరుధ్, కావ్య ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

రూ.50 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతున్న అనిరుధ్ పెళ్లి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories