సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు దేవా అందించిన సంగీతం ఆయన కెరీర్లోనే ఓ మైలురాయి. ముఖ్యంగా 'బాషా' 'అరుణాచలం', లాంటి సినిమాలు ఆయన మ్యూజిక్ కెరీర్లో ఎప్పటికీ బెస్ట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాల్లోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హీరో ఎలివేషన్‌కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. కథలోని వేగాన్ని, సీన్స్‌లోని ఎమోషన్‌ను తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు దేవా.
తెలుగులో దేవా సంగీతానికి అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, చిరంజీవి మాస్టర్ సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాలకు ఆయన అందించిన సంగీతం తెలుగు వారు మర్చిపోలేరు.
ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ టైమ్‌లోనూ తనదైన మార్క్!
1990ల టైమ్‌లో తమిళ మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. అప్పటికే ఇళయరాజాకు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు ఏఆర్ రెహమాన్ కొత్త సౌండింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
సరిగ్గా అలాంటి టైమ్‌లో దేవా తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యే ట్యూన్స్, మాస్ బీట్స్‌తో తనదైన ముద్ర వేశారు. ఇద్దరు లెజెండ్స్ మధ్యలో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవడం మామూలు విషయం కాదు.
కొత్త తరానికీ కనెక్ట్ అయిన గానా మ్యూజిక్!
కాలం మారుతున్నా మంచి మ్యూజిక్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పాత పాటలు ఇప్పుడు సోషల్ మీడియా, మ్యూజిక్ యాప్స్ ద్వారా కొత్త జనరేషన్‌కు కూడా రీచ్ అవుతున్నాయి. అలా దేవా పాటలు ఇప్పటికీ కుర్రకారును ఊపేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన గానా పాటల్లోని రిథమ్ ఇప్పటి యూత్‌ను కూడా అట్రాక్ట్ చేస్తోంది.