రజనీకాంత్ నటించిన 'అరుణాచలం', 'బాషా', 'పడయప్ప' (నరసింహ) సినిమాలకు దేవా అందించిన మ్యూజిక్ ఓ సెన్సేషన్. ముఖ్యంగా 'బాషా' సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు రజనీకాంత్ స్టైల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
స్క్రీన్ మీద రజనీకాంత్ కనిపించినప్పుడు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడానికి దేవా మ్యూజిక్ కూడా ఓ కారణం.
అలాగే అజిత్ నటించిన 'ఆసై', 'కాదల్ కొట్టై', 'వాలి'.. విజయ్ నటించిన 'నినైతేన్ వందాయ్', 'ప్రియముడన్', 'ఖుషి' సినిమాలకు కూడా దేవా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
తొంభైల దశకంలో ఒకవైపు ఇళయరాజా, మరోవైపు ఏఆర్ రెహమాన్ తమ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. అలాంటి కాంపిటీషన్లో కూడా దేవా టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడం మామూలు విషయం కాదు.
గుర్తింపు కోసం తపించిన కళాకారుడు!
ఏ ఆర్టిస్ట్‌కైనా సక్సెస్ ఒక్కటే సరిపోదు, సరైన గుర్తింపు కూడా కావాలి. రీసెంట్గా వచ్చిన 'లబ్బర్ పందు' సినిమాలో "రాజా రాజానే.. ఇది దేవా పాట" అనే డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
తన మ్యూజిక్ ఐడెంటిటీ గురించి ఉన్న ఆవేదనను ఆ డైలాగ్ తీర్చిందని దేవా స్వయంగా చెప్పారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఒక లెజెండ్‌కు, తన పేరు, తన పాట సరిగ్గా గుర్తింపు పొందడం ఎంత అవసరమో ఈ సంఘటన చెబుతుంది.