తనకు ఏదో అయిపోయింది అని ప్రచారం చేస్తున్న ట్రోలర్స్ కు గట్టి షాక్ ఇచ్చాడు హీరో విశాల్. తన పని అయిపోయిందని.. లోపల ఏదో ప్రాబ్లమ్ ఉందని, చేతులు వణుకుతున్నాయని, ఇక సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడని.
ఇలా రకరకాలుగా తనపై ప్రేమ కురిపించిన వారికి కృతజ్ఞతలు చెపుతూ.. ఇప్పుడు తన చేతులు వణకడంలేదు అని సెటైరికల్ గా మాట్లాడారు విశాల్. గత కొద్దిరోజులుగా ఎక్కడా కనిపించని విశాల్.. రీసెంట్ గా తన సినిమా ఈవెంట్ లో అందరు షాక్ అయ్యేలా కనిపించాడు.
Also Read: 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
దాదాపు 12 ఏళ్ళ క్రితం తెరకెక్కిన మదగజరాజా సినిమా రిసెంట్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. మాజీ హీరోయిన్ ఖుష్బు భర్త సీ సుందర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ప్రీరిలీజ్ఈ వెంట్ కు వచ్చిన విషాల్ ను చూసి ఒక్క సారిగా భయపడ్డారు జనాలు.
స్ట్రాంగ్ గా ఫిట్ గా ఉండే విశాల్ చాలా సన్నాగా, వణుకుతూ, నడవడానికి కూడా వీలు లేకుండా మారిపోయాడు, మైక్ పట్టుకుని మాట్లాడటానికి కూడా అతనికి ఓపిక లేకపోయింది. దాంతో ఒక్క సారిగా సోషల్ మీడియా గుప్పుమంది.
Also Read: హీరోయిన్ ను అడ్డుపెట్టుకుని అల్లు అర్జున్ పై సెటైర్లు వేసిన డైరెక్టర్, సంచలనంగా మారిన వ్యాఖ్యలు
విశాల్ గురించి ఒకటికి పది వార్తలు వైరల్ అయ్యాయి. అతనికి వింత వ్యాధి ఉందని, సినిమా ప్రమాదం వల్ల తలలో నరాలు చిట్లాయని, పెళ్ళి క్యాన్సిల్ అవ్వానికి ఇదే కారణమని, ఓ డైరెక్టర్ వల్లే ఇది జరిగిందని, ఇలా విశాల్ అనారోగ్యం గురించి రాని వార్తంటూ లేదు. అప్పటికి ఈ విషయంలో విశాల్ టీమ్ తో పాటు.. ఖుష్బు కూడా ఓ క్లారిటీ ఇచ్చింది.
అటు అపోలో హాస్పిటల్ కూడా హెల్త్ బులెటన్ రిలీజ్ చేశారు. విశాల్ కు వైరల్ ఫీవర్ రావడంతో హాస్పిటల్ లో చేరారని, ఈసినిమా ఫంక్షన్ కు పట్టు పట్టి తాను రావాలి అని ఆ పరిస్థితుల్లో కూడా వచ్చి.. మళ్ళీహాస్పిటల్ కు వెళ్ళాడంటూ ఖుష్బు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read:రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అన్నగా స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందా..?
అయినా విశాల్ పై వార్తలు ఆగలేదు. డెంగ్యూ ఫీవర్ వల్లే విశాల్ అలా వణికారని, త్వరలో కోలుకుంటారంటూ విశాల్ మేనేజర్ కూడా మీడియాకు ఇన్ఫార్మేషన్ ఇచ్చారు. ఇక వైరల్ వార్తలు ఆగకపోవడంతో.. డైరెక్ట్ గా విశాల్ రంగంలోకి దిగారు. మదగజరాజా ప్రీమియర్ షోకు వచ్చిన విశాల్ ను చూసి మరోసారి షాక్ అయ్యారు అంతా.
Also Read: రామ్ చరణ్ అయిపోయాడు ఇక మరో పాన్ ఇండియా హీరోతో శంకర్ సినిమా..?
Vishal
అప్పుడు అలా వణికిపోయిన విశాల్. ఇప్పుడు ఫిట్ గా కనిపించారు. స్ట్రాంగ్ గా కనిపించారు. ఇప్పుడునా చెయ్యి వణకడంలేదు చూడండి. మా నాన్న వల్లే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నేను తట్టుకొని నిలబడతాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవల కొంతమంది నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళను. నాకు ఎలాంటి సమస్య లేదు అన్నారు.
vishal
ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఇప్పుడు నా చేతులు కూడా వణకట్లేదు. మైక్ కూడా కరెక్ట్ గానే పట్టుకున్నాను. నా మీద మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. మీ అభిమానాన్ని చివరివరకు మర్చిపోను. మీ ప్రార్థనలు నన్ను త్వరగా కోలుకునేలా చేసాయి అని తెలిపారు. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ట్రోలర్స్ నోటికి తాళంపడినట్టు అయ్యింది.