వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర సంఘటనలని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ సినిమాని రిజెక్ట్ చేశారట. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.
అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. సంక్రాంతి డైరెక్టర్ అనే ముద్ర కూడా పడింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతోంది.
25
వరుస హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి
పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ తెరకెక్కించిన అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. మధ్యలో ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు. అవి కూడా సక్సెస్ అయ్యాయి. దర్శకుడిగా కంటే ముందుగా అనిల్ రావిపూడి కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. కందిరీగ, ఆగడు లాంటి సినిమాలకు అనిల్ రావిపూడి వర్క్ చేశారు. దర్శకుడిగా పరిచయం అయింది పటాస్ మూవీతోనే.
35
మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి
అంతకంటే ముందుగానే అనిల్ రావిపూడికి దర్శకుడిగా అవకాశం వచ్చిందట. అది కూడా ఏకంగా మల్టీస్టారర్ మూవీ. ఆ సినిమా మరేదో కాదు.. రామ్, వెంకటేష్ నటించిన మసాలా. సురేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని ముందుగా అనిల్ రావిపూడికే ఇచ్చారట. కానీ తాను రిజెక్ట్ చేసినట్లు అనిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ముందుగా సురేష్ బాబు గారు డైరెక్టర్ గా అవకాశం ఇవ్వగానే టెంప్ట్ అయ్యా. వెంకటేష్, రామ్ లతో మల్టీస్టారర్ కాబట్టి బావుంటుంది అని అనుకున్నా. కానీ మసాలా సినిమా మాతృక బోల్ బచ్చన్ ని ఆల్రెడీ చూశాను. దీనితో నా తొలి చిత్రం ఇలాంటి కంటెంట్ తో తీయకూడదు.. కొంచెం యాక్షన్ ఉండాలి అనే భావించా. అందుకే ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్లు అనిల్ తెలిపారు. కానీ ఆ చిత్రానికి రచయితగా మాత్రం వర్క్ చేశారు.
55
రామ్ పోతినేనితో ఆ సూపర్ హిట్ మూవీ మిస్
రామ్ తో మరో సినిమా కూడా మిస్ అయినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. రాజా ది గ్రేట్ సినిమాని ముందుగా రామ్ తో అనుకున్నాం. రామ్ అంతకు ముందే హైపర్ అనే యాక్షన్ మూవీ చేశారు. మళ్ళీ యాక్షన్ మూవీ వద్దులే అని రాజా ది గ్రేట్ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దీనితో అదే కథలో మార్పులు చేసి రవితేజతో తెరకెక్కించినట్లు అనిల్ రావిపూడి పేర్కొన్నారు.