అఖండ 2 – తాండవం
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అఖండ 2. ఆధ్యాత్మిక అంశాలు ఉన్న ఈ కథలో బాలయ్య అఘోర పాత్రలో అఖండ గా నటించారు. డిసెంబర్ లో ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయింది. జనవరి 9న ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో అఖండ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 9, 2026
దే దే ప్యార్ దే 2
వయస్సు తేడాతో ప్రేమించిన అశీష్ – ఆయేషాల కథ మరో మలుపు తిరుగుతుంది. ఈసారి ఆయేషా కుటుంబాన్ని ఒప్పించాల్సిన సవాల్. కుటుంబ విలువలు, ద్వంద్వ ప్రమాణాలపై ఈ సినిమా ప్రశ్నలు వేస్తుంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగన్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 9, 2026
హిస్ అండ్ హర్స్
ఒక హత్య కేసు… ఇద్దరు దంపతులు… ఇద్దరి వేర్వేరు కథనాలు. ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెబుతున్నారు? అనే సందేహాలతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 8, 2026
పీపుల్ వీ మీట్ ఆన్ వెకేషన్
పది ఏళ్ల స్నేహం, ప్రయాణాలు, చెప్పుకోని భావాలు ప్రేమగా మారితే ఏమవుతుంది? టైమ్-జంప్ నరేషన్‌తో సాగే హృద్యమైన రొమాంటిక్ డ్రామా.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జనవరి 9, 2026