టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ యాంకర్లలో వింధ్య ఒకరు. ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ పై వింధ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
టాలీవుడ్ లో రాణిస్తున్న లేడీ యాంకర్స్ చాలా మందే ఉన్నారు. సుమ, శ్రీముఖి లాంటి వారు టాప్ యాంకర్స్ గా దూసుకుపోతున్నారు. ఇటీవల యాంకర్ వింధ్య స్పోర్ట్స్ యాంకర్ గా బాగా గుర్తింపు పొందారు. క్రికెట్ మ్యాచ్ కార్యక్రమాలకు ఆమె హోస్ట్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడూ తెలుగు టీవీ షోలలో కూడా మెరుస్తున్నారు. సినిమా కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేస్తున్నారు. కానీ ఆమె ఎక్కువగా గుర్తింపు పొందింది మాత్రం క్రికెట్ కార్యక్రమాలతోనే.
25
తెలుగు మాట్లాడలేని యాంకర్స్ పై ఇలా
తెలుగులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు సరిగ్గా రాకపోయినా యాంకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. రష్మీకి తెలుగు రాదు అని పలు సందర్భాలలో ఆమెపై సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. తెలుగు రాని యాంకర్లపై యాంకర్ వింధ్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా తెలుగు భాషను బ్రష్టు పట్టిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
35
డర్టీ కామెడీ అలవాటు చేసేశారు
ప్రస్తుతం బుల్లితెర షోలలో యాంకర్ మాట్లాడే భాష కంటే వల్గారిటీ, డర్టీ కామెడీ ప్రధానంగా మారిపోయింది. గతంలో కామెడీ ఎంతో అద్భుతంగా ఉండేది. బ్రహ్మానందం గారిని చూడండి. ఆయన చేసే కామెడీ సన్నివేశానికి తగ్గట్లుగా ఉంటుంది. డర్టీగా అనిపించే కామెడీ చాలా తక్కువ. ఇప్పుడున్న కమెడియన్లలో వెన్నెల కిషోర్ గారు బెస్ట్ కమెడియన్. ఇప్పటికీ ఆయన డర్టీ కామెడీ చేయరు. ఆయన కామెడీకి ఒక క్లాస్ ఉంటుంది.
కానీ ఇప్పుడు వస్తున్న కొంతమంది కమెడియన్లు ఏం మాట్లాడుతున్నారో, ఎలాంటి పంచ్ లు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం టీవీ షోలలో కామెడీ అంటే డర్టీగానే ఉండాలని జనాలపై రుద్దుతున్నారు.
55
అంత వరకు తెచ్చుకోను
కొన్ని ఈవెంట్స్ లో, టీవీ షోలలో యాంకర్లపై కూడా డబుల్ మీనింగ్ పంచ్ లు వేస్తున్నారు. అలాంటి వాటిపై మీ స్పందన ఏంటి అని వింధ్యని ప్రశ్నించగా.. అంత వరకు నేను తెచ్చుకోను. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ గారిని స్టేజిపైకి పిలవాలి అంటే.. రాంగోపాల్ వర్మ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పి ఆయనకు మైక్ ఇచ్చేస్తా. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడను. మనం మాట్లాడితే ఆయన మన గురించి మాట్లాడతారు అని తెలుసు అంటూ వింధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.