జూనియర్ ఎన్టీఆర్ ఆశలపై లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ నీళ్లు చల్లారు. ఆయన అడిగిన ఒక్క సందేహంతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు పోలికలతో ఉంటాడని అభిమానులు అందరూ అంటుంటారు. తారక్ ఎప్పటికైనా నందమూరి తారక రామారావు క్లాసిక్ చిత్రాలని రీమేక్ చేయాలని లేదా అలాంటి పాత్రలో నటించాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ క్లాసిక్ చిత్రాలని రిమేక్ చేసి ఇప్పటి తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులువైన పని కాదు.
25
ఆ సినిమా రీమేక్ కి ప్రయత్నం
కానీ ఈ ప్రయత్నాన్ని జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు అనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన క్లాసిక్ చిత్రాల్లో గుండమ్మ కథ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మనవళ్లు కాబట్టి ఆ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా కొందరు భావించారు.
35
వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
నటుడు, నిర్మాత మురళి మోహన్ గుండమ్మ కథ రీమేక్ కోసం ప్రయత్నాలు చేశారు. తారక్, నాగ చైతన్య కలసి నటిస్తే ఆ చిత్రానికి సాయం చేయడానికి నాగార్జున కూడా ముందుకు వచ్చారు. కాకపోతే అది క్లాసిక్ మూవీ. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరించారట. అంతా ఓకె అనుకున్న తర్వాత ఈ ప్రపోజల్ ఏఎన్నార్ వద్దకు వెళ్ళింది. గుండమ్మ కథ రీమేక్ చేయడానికి ఏఎన్నార్ అడ్డు చెప్పలేదు. కాకపోతే ఆయన అడిగిన ఒకే ఒక్క డౌట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అప్పటి నటీనటుల్ని మించి మెప్పించడం అంత సులువు కాదు. ఎన్టీఆర్, నాగ చైతన్యకి క్రేజ్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. నటీనటులు కూడా అందరూ సెట్ కావచ్చు. కానీ టైటిల్ రోల్ లో నటించడానికి ఆప్షన్ ఎవరు ఉన్నారు. అదే సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రకి ఎవరిని పెడుతారు ? సరైన ప్రత్యామ్నాయం ఉందా అని ఏఎన్నార్ ప్రశ్నించారట. దీనితో ఎవరి నోటి వెంటా మాట రాలేదు.
55
తారక్ కి అది ఎప్పటికీ సాధ్యం కాదా ?
గుండమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతంకి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి నటి లేకుంటే ఈ సినిమా సాధ్యం కాదు అని ఏఎన్నార్ అన్నారట. ఆ విధంగా గుండమ్మ కథ రీమేక్ ఆగిపోయింది. ఎన్టీఆర్, నాగ చైతన్య ఆశలు గల్లంతు అయ్యాయి. తారక్ అభిమానులు దానవీర శూర కర్ణ చిత్రాన్ని కూడా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. గుండమ్మ కథ రీమేక్ సాధ్యం కాలేదు కాబట్టి దాన వీర శూర కర్ణ రీమేక్ కూడా తెరకెక్కడం అసాధ్యం అని కొందరు భావిస్తున్నారు.